మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పార్టీ పెట్టేశారు. అభ్యుదయ పార్టీ అద్యక్షుడు అయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళెందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభలు ఏర్పాటు చేసి దుమ్ము రేపుతున్నారు. తెలంగాణలో చార్మినార్, ఏపీలో కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద సభలు ఏర్పాటు చేశారు. ప్రజలను అభ్యుదయ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతుతున్నారు.
రామ్ చరణ్ పార్టీ పెట్టడం ఏంటి..? సభలు నిర్వహించడం ఏంటి..? బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ జనసేన ఉండగా…. రామ్ చరణ్ పోటీగా అభ్యుదయ పార్టీ స్థాపించడం జరిగిందా..? అనుకుంటున్నారా. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. రామ్ చరణ్ పార్టీ పెట్టడం నిజం కాదు. ఇదంతా ఆయన తాజా సినిమా కోసం రెడీ చేసుకున్న స్క్రిప్ట్.
దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ తన 15వ చిత్రం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీ షూట్ ను పబ్లిక్ లోనే జరుపుతుండగా ఇందుకు సంబంధించిన స్టిల్స్, వీడియోలు లీక్ అవుతున్నాయి.
హైదరాబాద్ చార్మినార్ వద్ద ఒక పొలిటికల్ మీటింగ్ కి సంబంధించిన సన్నివేశం చిత్రీకరించారు. అలాగే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మరో పొలిటికల్ మీటింగ్ సీన్ షూట్ చేశారు. ఈ రెండు సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Shooting at historic Kondareddy Burju #RC15. pic.twitter.com/mhbRE5Ysg5
— #RC15 (@RamCharan15Film) February 10, 2023
ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ఆయన అభ్యుదయ పార్టీ నేత. ఈయనకు జోడీగా అంజలి నటిస్తోంది. అభ్యుదయ భావాలు కలిగిన నిరాడంబరమైన రాజకీయ నాయకుడిగా ఆయన పాత్ర ఉండనుంది.మరో పాత్రలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వాని నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు చాలా వరకు బయటకొచ్చాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.