ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. దేశంలోని అనేకమంది ప్రముఖులకు ఈ లిక్కర్ కుంభకోణంతో సంబందం ఉన్నట్టు గుర్తించిన ఈడీ… ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వారికి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా అనేక సార్లు సోదాలు నిర్వహించి కీలక సమాచారం,ఆధారాలు సేకరించింది. ఓ వైపు సోదాలు చేస్తూనే అరెస్టులు మొదలుపెట్టింది. ఇటీవల కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేయగా..తాజాగా ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంబదించిన వాళ్ళుకు నోటీసులు జారీ చేసిన ఈడి… శనివారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తుంది. ముందు ముందు ఇంకెవరిని అరెస్ట్ చేయబోతున్నారో అని ఆసక్తి ప్రజల్లో నెలకొంది.
ఈ కేసులో ఎవరెవరు కీలకంగా ఉన్నారో వారిని గుర్తించిన ఈడీ… కీలకంగా వ్యవహరించిన వారి సన్నిహితులను మొదట అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారి నుంచి కీలక సమాచారం రాబట్టి తరువాత అసలు వ్యక్తుల దగ్గరకు వస్తారని అంటున్నారు.