పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను డైనమేట్లు పెట్టి పేల్చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించగానే.. అలాంటి ప్రకటనలు చేయడానికి ఆయనెవరు.? చేస్తేగీస్తే తానే చేయలనుకున్నారో ఏమో కాని బండి సంజయ్ తెరమీదకు వచ్చారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంస్కృతి, సంప్రదాయమని టచ్ ఇచ్చారు. ఇలాంటి నిర్మాణాలు భారతీయత కాదని బండి సంజయ్ ఎందుకు అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. తాజ్ మహల్ నామూనాను పోలి ఉందని బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తాజ్ మహల్ ను చూసేందుకు హిందువులు వెళ్తుంటారు. ముస్లింలు వెళ్తుంటారు. ప్రేమకు గుర్తింపుగా నిర్మించిన తాజ్ మహల్ నమూనా ఆధారంగా కొత్త సచివాలయం నిర్మిస్తే తప్పేంటి..?అనేది బీజేపీ నేతలకు కూడా ఓ పట్టాన అర్థం కావడం లేదు. పైగా.. మతకోణంలో ఆలోచించడం ఏంటని బండి సంజయ్ తీరును తప్పుబడుతున్నారు.
సచివాలయం డోమ్ లు ఓ వర్గం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. కాని బండి సంజయ్ కు మాత్రమే అలా అనిపించింది. నిజానికి.. కొత్త సచివాలయం కొత్తగా ఏమి లేదు. బీజేపీ అధికారంలోనున్న యూపీ, కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీల మాదిరే తెలంగాణ సచివాలయం డోమ్ లున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ చెప్తున్న ప్రకారం..ముందు కూల్చాల్సింది తెలంగాణ సచివాలయం డోమ్ లు కాదు. బీజేపీ అధికారంలోనున్న కర్ణాటక, యూపీ, గుజరాత్ సచివాయం డోమ్ లనే. మరి.. బండి సంజయ్ ఆ పని చేయగలరా..? అన్నది తేలాలి.
బండి సంజయ్ వ్యవహారం ఇటీవల బాగా ట్రోల్ అవుతోంది. ఢిల్లీలో బడ్జెట్ పై ఆయన స్పందించిన తీరును కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. దేశం మొత్తం తెలిసేలా చేశారు. ఇప్పుడు సచివాలయం డోమ్ ల విషయంలోనూ కూల్చివేత ప్రకటనలతోనూ అదే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి…ప్రగతి భవన్ పై రేవంత్ ప్రకటనలతో జోరుగా చర్చ జరుగుతుండగా… అత్యుత్సాహం ప్రదర్శించే బండి సంజయ్ ఈ కామెంట్స్ చేసి ఉంటారని సందేహిస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్ మిస్ ఫైర్ అయి బీజేపీనే వేలెత్తిచూపించేలా ఉన్నాయి.