మతాన్ని మించిన మత్తుమందు లేదని అరిస్టాటిల్ చెప్పింది నిజమే. ఇది హిందూ మతానికే కాదు – అన్ని మతాలకు వర్తిస్తుంది. తాగితే లివర్ చెడిపోతుంది అని డాక్టర్ చెపితే – పుట్టిన వాడికి గిట్టక తప్పదుగా అని బదులిస్తాడు తాగుబోతు. మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చావు? అని అడిగితే జవాబు చెప్పాడు.
రెండు పెగ్గులు తాగు అని తియ్యటి మాటలు చెప్పే మిత్రుడికంటే తాగకు అని తిట్టే తల్లే మంచిది. మనను ఏలుతున్న బిజెపి మతం పేరుతో పెగ్గులు పోస్తూ మన చావుకు వీసాలు ఇస్తోంది. ఆ మతం మత్తులో తూలుతున్న కొందరు పాఠక దేవుళ్లు మేము రాసే నిజాలను తప్పులుగా భావిస్తున్నారు. మేము బిజెపిని తిడుతూ – కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతున్నామని ఆరోపిస్తున్నారు. అది మీ తప్పు కాదు. మీకు పట్టిన మతం మత్తు తప్పు. మీరు ఆ మత్తులోంచి బయటపడాలని మనవి చేస్తున్నాము.
ఫిబ్రవరీ 14 ను అవును కౌగిలించుకునే దినంగా పాటించాలని మేము సృష్టించిన వార్తా? దాని జీవోను ప్రభుత్వం విడుదల చేయలేదా?ఆదాని తప్పులను మోడీ సమర్థించాడు అని రాసిన వార్త మా సొంత కవిత్వమా? పార్లమెంట్ లో మోడీ చెపుతుంటే యావత్తు దేశం వినలేదా?కోవి షీల్డ్ వాక్సిన్ వల్ల ప్రమాదం పొంచి ఉన్నది అని మేము పరిశోధన చేసి రాసిన వార్తా? ప్రముక కార్దియలగిస్ట్ ఆసీం మల్హోత్రా చేసిన పరిశోధన చెప్పింది రాశాముగా. అందుకే తగిన సాక్ష్యాలను కూడా వార్త మధ్యలో ఇరికిస్తున్నాము.
మేము పోస్ట్ మాన్ లాంటి వాళ్ళము. అక్కడి వార్తలు ఇక్కడ – ఇక్కడి వార్తలు అక్కడికి మోస్తాము. కానీ సొంతంగా ఉత్తరాలు రాయము.పొతే కాంగ్రెస్ కి మేము వత్తాసు పలుకుతున్నాము అని అపార్థం చేసుకుంటున్నారు. పత్రికలు అసంబ్లీ లాంటివి. అధికార పార్టికి ఎంత విలువ ఇవ్వాలో ప్రతిపక్షానికి కూడా అంతే విలువ ఇవ్వాలి. ఇద్దరి వెర్షన్లు మేము వినాలి – రాయాలి. అ రెండు చదివాకా ఎవరు తప్పో – ఎవరు ఒప్పో నిర్ణయించవలసింది మీలాంటి పాఠక దేవుళ్లు. మేము ఏమిరాసినా నిజాని మీ వరకు చేరాలన్నదే మా తపన.
దయచేసి మీరు ఓ నిజాన్ని గ్రహించాలి. పొగడ్తలు చెవిటి వాడికి కూడా వినికిడి శక్తిని ఇస్తుంది. అలాగే అధికార పార్టీ తియ్యటి మాటలు మీకు చేరవేస్తే మీకు షుగర్ వస్తుంది. ప్రతిపక్షాల కాకర కాయ చేడుమాటలు వినడానికి – తినడానికి చేదుగా ఉన్నా మీ ఆరోగ్యాని కాపాడుతుంది. మోసం చేసే వాడే మిమ్మల్ని పొగుడుతాడు. మీ మంచి కోరేవాడు మిమ్మలి విమర్శిస్తాడు. అందుకే అధికార పార్టి బిజెపి, బిఆర్ఎస్ చేసే తప్పులను ఎప్పటికప్పుడు తెలపాలి. ఆ తప్పులు వాళ్ళు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటారు.ā
మీరు ఈ స్తాయికి ఎదిగారు అంటే – స్టూడెంట్ గా మీరు చేసిన తప్పులను మీ టీచర్ రోజు ఎత్తి చూపి తిట్టింది. అందుకే మీరు అన్ని పరీక్షలల్లో పాస్ అయ్యారు. మీరు చేసిన తప్పులను టీచర్ పొగిడితే మీరు ఈ స్తాయికి ఎదిగేవారా? దయచేసి మీరు ఈ వాస్తవాని తెలుసుకోని మా వార్తలను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోగలరని మనవి.