త్వరలో తెలంగాణాలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడున్న గవర్నర్ తమిళ సై పదవికి గండం పొంచి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చేసున్న హడావుడిని బట్టి తెలుస్తోది. ఎందుకంటే కెసిఆర్ నీ ఢీకొనడం ఆమె వల్ల కావడం లేదని అమిత్ షా గట్టిగా నమ్ముతున్నారు. ఆమె మిగతా గవర్నలలాగా కెసిఆర్ నీ ఏడిపించడం లేదు. తనను గౌరవసించడం లేదని ఆమెనే ఏడుస్తోంది. దీనికి చక్కటి ఉదాహరణ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు.
లోగడ ఎన్ టి రామారావు ప్రభుత్వాని నాటి గవర్నర్ రామ్ లాల్ కూల్చి నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి గా మార్చాడు. గవర్నర్ కు ఉండే పవర్ అలాంటిది. సరిగ్గా అదే స్క్రీన్ ప్లే నడపాలని బిజెపి నుంచి తమిళ సై కి ఆదేశాలు అందాయి. ఆ మిషన్ని ఎలా ఆపరేషన్ చేయాలో కూడా రోడ్ మ్యాప్ అందింది.అందులో మొదటిది – కేసిర్ పంపే బడ్జెట్ ని తిరస్కరించాలి. రెండోది – శాసన సభ జరగకుండా చూడాలి. మూడోది – రాష్ట్రపతి పాలనా వచ్చేలా చేయాలి.నాలుగోది – కేసిర్ జాతీయ పార్టిని పక్కన పెట్టాలి. అయిదవది – కెసిఆర్ మీద బురద చల్లి వచ్చే ఎన్న్నికలలో ఓడించి, బిజెపిని గెలిపించాలి.
కానీ కెసిఆర్ రాజకీయ చాణక్యుడు. ఎన్ టి రామారావులా రాజకీయ అనుభవం లేని వాడు కాదు. ఆ మాటకొస్తే మోడీ, అమిత్ షా ముదురు అయితే కెసిఆర్ దేశ ముదురు. ఇది ముందే పసిగట్టిన కెసిఆర్ తనమీద తప్పు లేకుండా తమిళ సై కి బడ్జెట్ పంపాడు. ఆమె ఆపరేషన్ మొదలు పెట్టింది. కానీ దానికి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కెసిఆర్ కోర్టుని ఆశ్రయించి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.
దాంతో కేంద్ర బిజెపి నేతలు ఉలిక్కిపడ్డారు. కెసిఆర్ ని గద్దె దించడమే కాదు – తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రావాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కెసిఆర్ దీనిని సింపతి గా మార్చుకుని ఎన్ టి రామారావులాగా మరోసారి గెలుస్తాడు. బిజెపి కి ఉన్న సీట్లు కూడా పోతాయి. తమిళ సై కూడా భయపడింది. నాటి గవర్నర్ రామ్ లాల్ నీ ప్రజలు రాళ్ళతో కొట్టిన విషయం లాయర్లు గుర్తు చేశారు. తర్వాత అతను అడ్రస్ లేకుండా పోయాడు. ఈ మిషయాన్ని గ్రహించిన తమిళ సై జాగ్రత్త వహించి తెగేంత వరకు లాగలేదు. కెసిఆర్ కి కుక్కిన పేనులా మారి – అతను ఇచ్చిన బడ్జెట్నీ ఓ న్యూస్ రీడర్ లా చదివింది.
ఇది బిజెపి నేతలకు అస్సలు నచ్చలేదు. ఆమె ప్రతిసారి తమమీద ఆడరపడుతోందని చిరకుపడుతున్నారు. కానీ సొంతంగా చక్రం తిప్పడం లేదు. ఎన్నికల ముందు ఆమె ఇలాగే ఉంటే కొంపలు అంటుకుంటాయి అని ఆందోళన చెందుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే కొత్త గవర్నర్ ని నియమించాలని కసరత్తు చేస్తున్నారు. ఆవుల కుమ్ములాటలో లేగ దూడల కాళ్ళు విరిగినట్లు – బిజెపి, బిఆర్ఎస్ కుమ్ములాటలో ప్రజల నడ్డి విరుగుతోంది.