ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో అరెస్ట్ జరుగుతోంది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్ లను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా వారికింకా బెయిల్ మంజూరు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును తాజాగా అరెస్ట్ చేశారు. మూడు రోజుల కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంతో ఒక్కొక్కరిగా సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసుతో అసలు వారిని అరెస్ట్ చేయడం లేదని ఈ కేసుపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ వ్యూహాత్మకంగానే ఈ కేసును సీబీఐ, ఈడీ డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం సౌత్ గ్రూప్ అంతా ఒకరి లబ్ది కోసమే జరిగిందనీ… ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా ఈడీ సేకరించింది. కేసులో అసలు నిందితుల చుట్టూ ఉచ్చు బిగించేందుకు ఒకరి తరువాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. చార్జీషీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల ప్రమేయం గురించి ప్రస్తావించారు. కానీ, వారిని ఇంకా సీబీఐ , ఈడీ చార్జీషీట్ లో నిందితులుగా చేర్చలేదు. ఆధారాలు సంపాదించే పనిలో ఉంది.
ఈ మధ్యం కుంభకోణం ద్వారా లబ్ది పొందిన వారు.. ఈ స్కాంకు స్కెచ్ వేసిన వారు చివరికి ప్రధాన నిందితులు అవుతారు. ఈ విషయాన్ని ఎక్స్ పోజ్ చేసిన తరువాత సీబీఐ , ఈడీలు వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రాజకీయంగా సున్నితమైన కేసు. ఏమాత్రం హడావిడి ప్రదర్శించి అరెస్టులు చేసినా కేసు తేలిపోతుంది . రాజకీయంగా దర్యాప్తు సంస్థలపై విమర్శలు వస్తాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు డీల్ చేస్తున్నారు.
ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరి ప్రమేయం ఉంది..? ఎవరెవరికి లబ్ది చేకూరిందనే సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెడుతూ.. వీరి వెనుక ఎవరు ఉన్నారన్న అంశాన్ని పకడ్బందీగా కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారని అంటున్నారు. చివరికి అసలు టార్గెట్ వద్దకు వస్తామంటున్నారు. ఈ కేసును పరిశీలిస్తే ఇప్పటివరకు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేయలేదు. ఇంకా ఒకరిద్దరు ఉన్నారని.. వారి తర్వాత అసలు టార్గెట్ ను అరెస్ట్ చేయవచ్చు.