ఫిబ్రవరి 14న పుల్వామా సంస్మరణ దినం నిర్వహిస్తోంది మోడీ సర్కార్. అదే రోజు ఫిబ్రవరి 14న ఆవు కౌగిలింత అనే రోజని కేంద్ర సర్కార్ ప్రకటించింది. అదే రోజు జరుపుకునే వాలంటైన్ డే ని రద్దు చేయాలనీ శాసించారు. పది రోజుల ముందు ప్రేమికులు ప్రత్యేకంగా చాక్లెట్ డే అని, ప్రపోజ్ డే, కిస్ డే అనే రోజులను జరుపుకుంటారు. భారతీయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ స్పెషల్ డేస్ ఉన్నాయనేది బీజేపీ వాదన.
కాబట్టి ఈ పది రోజుల్లో ఎదో ఒక రోజు ఈ కౌ హాగ్ డే ను ప్రకటించిన సరిపోయేది కాని..పుల్వామా అమర వీరుల సంస్మరణ దినం రోజునే ఈ కౌ హాగ్ డే జరుపుకోవాలని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. దీనితో దేశానికి ఎం సందేశాన్ని ఇవ్వాలని ఆరాటం? దేశాన్ని కాపాడే అమరవీరుల కంటే మతమే గొప్పా అని చాటడమా?
ఇండియాలో వాలంటైన్స్ డే ను జరుపుకుంటున్నారు. సనాతన ధర్మం అంటూ మాట్లాడే బీజేపీకి స్వతహాగానే ఇది నచ్చడం లేదు. అదే రోజున లవర్స్ డే కు కౌంటర్ గా పుల్వామా మృతవీరుల సంస్మరణ దినంగా పాటిస్తోంది బీజేపీ. రాజకీయాలు ఎలా ఉన్నా పార్టీలకతీతంగా ఆ రోజున పుల్వామా మృతవీరులను స్మరించుకుంటున్నారు. కాని ఎందుకో అదే రోజును” కౌ హాగ్ డే” గా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనౌన్స్ చేయడం ఏ రాజకీయమో ఎవరికీ అర్థం కావడం లేదు.
పిచ్చి ముదిరింది అంటే తలకు గజ్జలు కట్టమని చెప్పే డాక్టర్ని ఏమనాలి. ఇండియా లాంటి సామ్యవాద దేశంలో ఒక మతానికి పెద్దపీట వేస్తూ ఫిబ్రవరి 14ను ‘ఆవు కౌగిలింత రోజుగా’ పాటించాలని కేంద్రం నిర్ణయించడం ఏమిటీ? ‘లవర్స్ డే’ లాంటి సంస్కృతీ విదేశీయుల నుంచి మనకు ‘కరోనాలా’ సోకింది. ‘లవర్స్ డే’ పాటించకూడదు, అది మన సంస్కృతీ కాదని అని ప్రతి ఏడాది గగ్గోలు పెట్టే బీజేపీ ఇప్పుడు ‘కౌ హాగ్ డే’ అని అధికారికంగా ప్రకటించడం విడ్డురం.
‘ఆవును కాదు – అమ్మాయిని కౌగిలించుకునే రోజు’ అని ప్రకటించి ఉంటే కనీసం లవర్స్ సంతోషించే వాళ్ళు. ఇలాంటి నిర్ణయం వల్ల హిందూయిజాన్ని అభివృద్ధి చేయడం కాదు, అభాసుపాలు చేయడం. మన ప్రగతిని వెనక్కి లాక్కుపోవడం. అయినా ఆవును పూజించండి, లేదా ఆవు కాళ్లు మొక్కండి, లేదా ఆవుకు ఇంత గడ్డి తినిపించండి అని ప్రకటించినా బాగుండేది. కనీసం ‘ఆవుల రోజు’ అని చెప్పినా గౌరవంగా ఉండేది. కానీ అమ్మయిలా ఆవుని కౌగిలించుకోవడం ఏమిటి మోడీ? ఇదెక్కడి శృంగారం? ఏమిటో! గడ్డి తిని ఆవు పాలిస్తే – పాలు తగిన మనిషి గడ్డి తింటున్నాడు.