బి జె పి అండదండలతో పలు అక్రమాలు చేసిన నిరవ్ మోడీ, విజయ్ మాల్యా సరసన ఇప్పుడు గౌతమ్ అదానీ కూడా చేరిపోయాడు. బి జె పి అధికారంలోకి రావడానికి ఈ ముగ్గురు వేలాది కోట్లు దానం చేశారు. పది రూపాయల లాభం లేనిదే రూపాయి దానం చేయని నీచ్ – కొత్తే – కామినే గాళ్లు. అధికారంలోకి రాగానే బి జె పి అండతో బ్యాంకులలో లోన్లు తీసుకున్నారు.
ఆ కేసులను ఇండియాలో బయటపడకుండా మోడీ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కానీ నిజాన్ని దాచవలసిన అవసరం విదేశీ సంస్థలకు లేదు. వాళ్లు డబ్బుకు లొంగరు. అవినీతిని దగ్గరికి రానీయరు. ప్రజలకు స్వచ్ఛ మైన పాలలాంటి నిజాలు అందిస్తాయి. ఈ ముగ్గురి బాగోతలు ముందుగా విదేశీ సంస్థలు బయట పెడితే కానీ మనకు తెలియలేదు. ఇప్పుడు గౌతమ్ అదానీ విషయంలో కూడా అదే జరిగింది.
అయితే నిరవ్ మోడీ, విజయ్ మాల్యా కంటే గౌతమ్ అదానీ ఒక ఆకూ ఎక్కువే చదివాడు. అత్తా – పత్తా లేని కంపెనీలు సృష్టించి బ్యాంకుల నుంచి కోట్లాది లోన్లు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా మోడీతో చేతులు కలిపి ఎల్ ఐ సి లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయించి గుండెలు తీసిన బంటులా మారాడు.
అందుకే మొన్నటివరకు ప్రపంచంలో 609 స్థానంలో ఉన్న అతను ఏకంగా రెండో స్థానం వరకు ఎదిగాడు. దానికి మోడీ అండదండలు ఏ రీతిలో ఉన్నాయి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఫోటోలు, ఆధారాలతో సహా చూపించారు. కానీ పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకోరాదని స్పీకర్ అడ్డుకున్నాడు. ఫోటోలు, డాకుమెంట్స్ కూడా ప్లకార్డ్స్ కిందికి ఎలా వస్తాయో రాహులు గాంధీకే కాదు, దేశంలో ఎవ్వరికీ అర్థంకాలేదు. గంజాయి వనంలో తులసి మొక్కలా రాహుల్ మాత్రం ఏం చేయగలడు? రాహుల్ గాంధీది అరణ్యరోదన. బి ఆర్ ఎస్ లాంటి ప్రతిపక్షాలు ఎందుకు సహాయం చేస్తాయి? తమాషా చూస్తా కూర్చున్నారు.
8 బిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న గౌతమ్ అదానీ కేవలం 8 ఏళ్లలో 140 బిలియన్ డాలర్ల ఆస్తి ఎలా సంపాదించారో రాహుల్ గాంధీ గొంతు ఎత్తి అరిచాడు. ఏ మాత్రం అనుభవం లేకున్నా ఆంధ్ర ప్రదేశ్ లోని ఓడ రేవులు, రక్షణ రంగం కంపెనీలను, ఎయిర్ పోర్టులను, విమానాలను గౌతమ్ అదానీకి మోడీ ఎలా అప్పగించాడో వివరించాడు. మోడీ తిరిగిన విదేశాలలో గౌతమ్ అదానీకి దొరికిన కాంట్రాక్టులు ఎలా వచ్చాయో వివరించారు. ఇద్దరు కలిసి విదేశాలకు ప్రయాణించిన ఫోటోలు చూపితే బి జె పి స్పీకర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని బి జె పి ఎం పి లు సిగ్గు ఎగ్గు లేకుండా కొట్టిపడేసారు. రేప్ జరిగిగే రుజువు చేయవచ్చు. కానీ వ్యభిచారం జరిగితే ఎవరు మాత్రం రుజువు చేయగలరు? వ్యభిచారం జరగలేదని అటు విటుడు, ఇటు వేశ్య కూడా బుకాయిస్తుంది. పైగా చట్టానికి దొరక కూడా కండోమ్ వాడుతారు. వీళ్లను పట్టుకోవడం చాలా కష్టం. అందుకే మన దేశంలో రెడ్ లైట్ ఏరియాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం అండ ఉంటే చట్టం నుంచి తప్పించుకోవడం చాలా తేలిక. అందుకే లోగడ అడ్డంగా దొరికిన నిరవ్ మోడీ, విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయి దర్జాగా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్లను పట్టుకోడానికి ఇంటర్పోల్ చట్టాలు అడ్డొస్తాయి. ఉరి శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ ముషారఫ్ కూడా ఇలాగే దుబాయికి పారిపోయి దర్జాగా బతికి మొన్ననే కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు గౌతమ్ అదానీనీ కూడా విదేశాలకు పంపే కార్యక్రమాన్ని మోడీ చేపట్టాడు. త్వరలోనే పారిపోతున్నాడు. కాబట్టి ముందుగా అదానీ పాస్ పోర్ట్ లాక్కుని, పారిపోకుండా చూడాలని కాంగ్రెస్ ఎంపీలు గగ్గోలు పెట్టినా బి జె పి పట్టించుకోవడంలేదు. ఇక ప్రజలే దేశాన్ని కాపాడాలి.