ఫిబ్రవరి నెలఖారులో అసెంబ్లీని రద్దు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పర్యటనలు, సభలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇందులో భాగమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. అధికార యంత్రాంగాన్ని కూడా బదిలీ చేశారు. మిగిలిన బదిలీలను కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలను సైతం త్వరితగతిన అమలు చేయాలని చూస్తున్నారు.
ముఖ్యంగా పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కేసీఆర్ భావిస్తున్నారు, దీనిపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. రెండు రోజుల్లో పోడు భూముల ఇష్యూపై స్పష్టత రానుంది. ఈ నెల 17న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తరువాత పది రోజుల్లో అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలకు మానసికంగా కేసీఆర్ రెడీ అయిపోయారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. ఫైనలైజ్ చేసిన అభ్యర్థుల పేర్లను లీక్ కానివ్వడం లేదు. గతంలో ఐ ప్యాక్ టీం బీఆర్ఎస్ కు రాజకీయంగా సేవలు అందించినప్పుడు పలువురు అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చాయి. ఏమైందో ఏమో తరువాత ప్రశాంత్ కిషోర్ టీంను కేసీఆర్ దూరం పెట్టేశారు. తరువాత ప్రగతి భవన్ లో సీక్రెట్ గా ఈ వర్క్ ను ఫినిష్ చేశారు.
ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని బీజేపీ చెబుతుంది కాని.. ఆ పార్టీకి పలు చోట్ల అభ్యర్థులే లేరు. ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే కీలక నేతలు ఉన్న చోట మాత్రమే బీజేపీ గట్టిపోటీ నిస్తుంది తప్పితే అధికారం కైవసం చేసుకేనంత సీన్ కమలం పార్టీకి లేదు. కాంగ్రెస్ కూడా ఇంకా గాడిన పడలేదని.. అందుకే ముందస్తుకు కేసీఆర్ తొందరపడుతున్నారని అంటున్నారు.
ఈ నెలఖారులో అసెంబ్లీ రద్దు చేయాలనే ఒక నెల ముందుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఎన్నికల్లో నెగ్గేందుకు కేసీఆర్ ప్రణాళికను సిద్దం చేశారని.. పరేడ్ గ్రౌండ్ సభలో రైతులకు పెన్షన్ స్కీంపై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. పదిరోజులు ఈ అంశంపై చర్చ జరిగాక అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.