ఏ కోణంలో చూసినా బండి సంజయ్ కంటే బాబు మోహన్ అన్నివిధాలా గొప్పవాడు. బాబు మోహన్ ప్రభుత్వ ఉద్యోగం చేసిన బాధ్యత గల గెజిటెడ్ ఆఫీసర్. 25 ఏళ్లపాటు దాదాపు 900 సినిమాలు నటించిన గొప్ప నటుడు. తెలుగుతో పాటు దేశంలోని పలు భాషలలో నటించిన అపరానుభవం ఉన్నవాడు. ఓ నిర్మాత కూడా.
బండి సంజయ్ నెక్కర్లు వేసుకునే రోజుల్లో బాబు మోహన్ తెలుగుదేశంలో పరిపాలనలో పరిశ్రమల మంత్రిగా సంచలనం రేపినవాడు . బి ఆర్ ఎస్ పార్టీలో కేసీఆర్ తో సరిసమానంగా రాజకీయం నడిపినవాడు. దాదాపు 50 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడు ఇలా బూతులు మాట్లాడిన దాఖలాలు లేవు. మరి మొదటిసారి కడుపు రగిలి ఎందుకు శివమెత్తాడు? దీనికి కారకులు ఎవరు? కచ్చితంగా బి జె పి కారణం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
మొదటినుంచి బి జె పికి దక్షిణ భారత దేశంలో సరైన నాయకుడు లేడు. నాడు వాజ్ పేయి, ఏల్ కే అద్వానీ నాయకత్వంలో గుజరాత్ లో మోడీ లాంటి గట్టి నాయకుడు ఉండేవాడు. కానీ దక్షిణాన అలాంటి నాయకుడు లేదు. ముక్యంగా తెలంగాణలో లేరు. లక్ష్మణ్, బండి సంజయ్ లాంటి కార్యకర్తలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్లు. బి జె పి ని అడ్డుపెట్టుకుని, పదవిని అతికించుకుని పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లే. వీళ్ళను చూసేందుకు, వీళ్లు చెప్పెది వినడానికి ఏ ఒక్కరు రారు. వీళ్లు కార్యకర్తలు మాత్రమే. కానీ దౌర్బాగ్యం ఏమిటంటే తమనుతాము నాయకులుగా ఉహించు కుంటారు. గుడ్డివాళ్ల రాజ్యంలో మెల్లకన్నొడే రాజు అన్నట్లు బి జె పి ఇలాంటి వాళ్లను అందలం ఎక్కిస్తుంది.
కానీ బి జె పికి క్రౌడ్ పుల్లర్ కావాలి. అందుకే బాబు మోహన్, విజయశాంతి లాంటి ఫిగర్లు కావాలి. అందుకే బండి సంజయ్, లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ల ఇంటికి వెళ్లి పార్టీలో చేరమని బతిమాలుతారు. పదవులు ఇస్తామని, బి జె పిలో మీకు పూర్తి స్వచ్ఛ ఉంటుంది, అన్ని అధికారాలు ఇస్తామని, మీ కింద మేము పని చేస్తామని హామీలు గుప్పిస్తారు.
తీరా పార్టీలో చేరాక హనీమూన్ అధికారాలు ఇస్తారు. వాళ్లను తమ ప్రసార అస్త్రాలుగా మార్చుకుంటారు. ఆ తర్వాత అసలు రంగు చూపిస్తారు. వాళ్ళను ఓ కార్యకరలుగా బి జె పి జెండ మోయమంటారు. అందుకే వాళ్లు మింగలేక నరకం చూస్తారు. ఉన్నవే మూడు పార్టీలు. బి ఆర్ లోకి తిరిగి వెళ్ళలేరు. ఇలాంటి వాళ్ళను కాంగ్రెస్ దగ్గరికి రానివ్వదు. ఇక మిగిలిన ఏకైక దిక్కు బి జె పి ఒక్కటే. కాబట్టి గత్యంతరం లేక ఆఫీస్ బేరర్ లుగా పడుంటారు. తాము మోసపోయామని తెలుసుకునేలోగా అన్ని తలుపులు మూసుకుంటాయి.
ఇది నటులకే కాదు – కాకలు తిరిగిన రాజకీయ పాపులర్ నాయకులకు కూడా తప్పలేదు. ఇందులో ఈటెల రాజేందర్, రాజ్ గోపాల్ రెడ్డి లాంటి వాళ్లు ప్రముఖులు. ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని కెసిఆర్ కి తెలుసు. చూసి చూడనట్లు ఊరుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఎమ్మెలే కోట్లు ఖర్చు చేసి గెలుస్తారు. దాని రికవరీ చేసుకోడానికి ఇలాంటి అవకతవకలకు పాల్పడతారు. ఇది అందరు ఎమ్మెల్లేలు, అందరు ఎంపీలు చేసేదే. అన్ని పార్టీలు చేసే అక్రమాలే.
కానీ తిరుగులేని నాయకుడిగా ఉన్న ఈటెలను తమ పార్టీలోకి తెచ్చుకోవాలని పెద్ద ఆఫర్ ఇచ్చింది బి జె పి. అతను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బి జె పి. తెరవెనుక ఉంది శకుని రాజకీయం చేస్తూ ఆయన ఆక్రమించిన భూముల కుంభకోణం బయట పెట్టించి బి జె పి. కేసీఆర్ నీ ఇరకాటంలో పెట్టింది. తప్పనిసరి పరిస్థితిలో కెసిఆర్ అతనిని పార్టీలోంచి తీసేసింది. అప్పుడు బి జె పి. టికెట్ ఇచ్చి తన పథకం విజయవంతం చేసుకుంది.
రాజ్ గోపాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. 27 వేల కోట్ల కాంట్రాక్ ఇస్తామని బి జె పి ఆశ చూపి చేర్చుకుంది. అతను మునుగోడులో ఓడిపోయేసరికి ఇప్పుడు దగ్గరికి రావనివ్వడం లేదు. అతను కోపంలో రగులుతున్నాడు. అతనే కాదు, వలసవచ్చిన ఇలాంటి పక్షుల రెక్కలు విరిచేసి తమ పంజరంలో బందీలుగా మార్చింది బి జె పి. విజయశాంతి, ఈటెల, డీకే అరుణ లాంటి వాళ్లు బి జె పి.ని చాటుమాటుగా తిడుతున్నారు. కానీ ఇన్నిరోజులు బి జె పి.నీ చాటుమాటుగా తిట్టిన బాబు మోహన్ తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్లు బి జె పి. అధినాయకులు, బండి సంజయ్ లాంటి బచ్చా నాయకులను బహిరంగంగా అమ్మనా బూతులు తిట్టారు. బాబు మోహన్ చెప్పుతో కొడితే కొట్టాడు. కానీ ఎప్పటినుంచో బి జె పి నీ బాధ పెడుతున్న పిప్పి పన్ను ఊడింది. బి జె పి అసలు రంగు ప్రజలకు తెలిసింది. భేష్ బాబు మోహన్!