”నేను మూడుసార్లు పెళ్లిల్లు చేసుకున్నాను – మీరు కూడా మూడేసి పెళ్లిల్లు చేసుకోండి” అని జనసేన నేత పవన్ కళ్యాణ్ తరచూ ప్రతిపక్షాలను తిట్టే మాట ఇది. ఒకసారి పొరపాటున మాట్లాడితే సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రతి సారి ఇదే కారుకుతలు కూస్తున్నారు. ఓ హీరోలా ఇలా మాట్లాడవచ్చు. ఎవ్వరు పట్టించుకోరు. కానీ ఓ రాజకీయ వేత్తగా, జనసేన అధినేతగా ఇలా మాట్లాడం ఎవ్వరూ జీర్ణించుకోలేరు. ఇది యువతను తప్పు దోవ పట్టించేలా ఉంది. ఇది ఎలా ఉంది అంటే నేను తాగుబోతుని, మీరు కూడా తాగండి అని ఓ తండ్రి తన పిల్లలకు చెప్పడం లాంటిది.
పవన్ కళ్యాణ్ ఇంకా తాను హీరో అని భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా హీరోగా నటిస్తున్నారు కాబట్టి. కానీ రాజకీయ నాయకుడిలా ఇంకా భావించడం లేదు. ఎందుకంటే ఇలాంటి నోటి దురద వగుదువల్లే మహిళా ఓటర్ల దృష్టిలో దిగజారి పోయారు కాబట్టి. ఆ నాలుకకు జాలింలోషన్ పెట్టుకోవాలి. ఇక్కడ హీరోకి, రాజకీయ నాయకుడికి గల తేడాను అతను ముందుగా తెలుసుకోవాలి.
హీరో కళాకారుడు. అది అతని వ్యక్తిగత జీవితం. ఎవ్వరికీ సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే అడవిలో పెరిగే గుర్రం లాంటి వాడు. ఇష్టం వచ్చిన గడ్డి తినవచ్చు. కానీ రాజకీయ నాయుడు పందెంలో పాల్గొనే రేసు గుర్రం లాంటివాడు. అడ్డమైన గడ్డి తినకూడదు. యజమాని పెట్టిన గుగ్గిల్లే తినాలి. కళ్లెం వేస్తే వేయించుకోవాలి. ఎక్కితే ఎక్కించుకోవాలి. చెప్పిన దిశలో పరుగెత్తాలి. ఆ గుర్రంలో పాటు స్టేడియంలో చాలా గుర్రాలు ఉంటాయి. వాటి వేగాన్ని మించి పరుగెత్తాలి. వాటిని దాటలే కానీ పడేయకూడదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తుంటారు. కొన్ని కోట్ల బెట్టింగులు కాస్తారు. కొన్ని కోట్లమంది జీవితాలు ఆ గుర్రం పరుగు, ప్రవర్తన మీద ఆదరదపడాయి కాబట్టి.
తాను చేసింది తప్పుని పవన్ ఇంకా భావించడం లేదు. ‘నేను చట్ట పరంగా ఇద్దరికీ విడాకులు ఇచ్చి దర్జాగా మూడో పెళ్లి చేసుకున్నాను. మిగతావాళ్ల లాగా ఒకే భార్యతో కాపురం చేస్తూ ముప్పై మంది కీపులతో తిరిగాం లేదు’ అని తనను తాను సమర్ధించుకుంటున్నారు. తన కాళ్ళు తానే మొక్కుకుని తనను తానే దీవించుకుంటున్నారు. ఇది ఎలా ఉంది అంటే గాడిదను చూసి ”దానికి నాలుగు కాళ్లు ఉన్నాయి” అని గుర్రం నవ్వుకోవడం.
అతను విదేశీ సెల్ ఫోన్ కి అలవాటు పడ్డట్లే విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డాడు. అందుకే చివరికి విదేశీ స్త్రీ అన్నా లిజెనివాని (2013) మూడో భార్యగా చేసుకున్నాడు. కానీ ఆమెకు ఇతను ఎన్నో భర్తనో ఆ దేవుడికే తెలియాలి. ఇతనిని మూడో పెళ్లి చేసుకోడానికి ఏ భారతీయ స్త్రీ కూడా ముందుకు రాలేదని గమనించాలి.
కృష్ణ లాంటి హీరో కూడా రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు అని పలుమార్లు అన్నారు. కానీ అయన ఏ భార్యను వదిలేయలేదు. మొదటి భార్య కు (మహేష్ బాబు తల్లి) ఎంత న్యాయం చేసి ప్రేమించాడో, రెండో భార్య (నరేష్ తల్లి)ను కూడా న్యాయం చేసి ప్రేమించారు. కడవరకు ఇద్దరితో ఉన్నారు. అందుకే అయన హీరోలా గెలిచారు. ఎంపీగా కూడా గెలిచారు. కానీ పవన్ రెండు విధాలా ఓడిపోవడమే కాదు – పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. రెండు పెళ్లిల్లు చేసుకున్న దేవుళ్ళు మనకు ఎందరో ఉన్నారు. కానీ విడాకులు ఇచ్చి వాళ్ళ గొంతు కోసిన దేవుళ్ళు లేదు.
నిజం చెప్పాలంటే విదేశీయులు వేల సంవత్సరాల నాటి మన హిందు సంప్రదాయం, యోగాను అనుసరిస్తున్నారు. ‘మీరు హిందువుల లాగా ఎందుకు బతకలేకపోతున్నారు?’ అని కోర్టులు విదేశాల్లో గగ్గోలు పెడుతున్నాయి. కానీ మనం దాని కాపాడుకోలేక పోతున్నాము. ”నేను మూడుసార్లు పెళ్లిల్లు చేసుకున్నాను. అందులో తప్పేముంది?” అని బల్లగుద్ది వాదించే పవన్ కళ్యాణ్ ఓ పచ్చి నిజాన్ని గమనించాలి.
అతనికి విడాకులు ఇచ్చిన మొదటి భార్య నందిని (1997 – 2008) అతనిలాగే దర్జాగా రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆమె సనాతన సంప్రదాయంలో పుట్టిన పాతకాలం స్త్రీ అనుకుందాము. మరి రెండో భార్య రేణు దేశాయ్ (2009 – 2012) కూడా దర్జాగా రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? రేణు ఆల్ట్రా మోడరన్ కుటుంబంలో పుట్టింది. కాస్మోపాలిటన్ నగరంలో పెరిగింది కదా? మరి రెండో పెళ్ళికి ఎందుకు ఛీ కొట్టింది? ఎందుకంటే తన పిల్లలే తన ప్రపంచం అని బతుకుతోంది. రెండో పెళ్లి తప్పని కాదు. అది ఒక నైతిక విలువ. సామజిక బాధ్యత. జీవితం అంటే సుఖపడడం కాదు – త్యాగం చేయడం అని ఆ ఇద్దర్ని చూసి పవన్ నేర్చుకోవాలి. ఇలాంటి స్త్రీ మూర్తులు ఉన్నారు కాబట్టే మన హిందూ సంప్రదాయం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తోంది. కానీ ‘మూడు’ కాళ్ళ మీద నడవడం లేదు.
పవన్ కూతురు కూడా మునుముందు మూడు పెళ్లిల్లు చేసుకుంటే ఓ తండ్రిగా సమర్థిస్తారా? ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. కానీ ఆ తప్పును తెలుసుకున్నవాడే మనిషి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన తప్పును తెలుసుకుంటే చాలు. ఇకపై ప్రెస్ మీట్లో మాట్లాడే తప్పుడు ”నేను పొరపాటునో – గ్రహపాటునో మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు. నా దౌర్భాగ్యం మరో మగాడికి రాకూడని కోరుకుంటున్నాను” అని చెపితే సభ్య సమాజం క్షమిస్తుంది. కనీసం మహిళల ఓట్లు పడతాయి.