కొంతమంది ఖమ్మం బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కారణం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తిరుగుతున్నారని. తమ అనుచరులపై వేటు వేసిన విషయం తెలిసిన పొంగులేటి చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
సినిమా డైలాగ్ తరహలో బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ చేశారు. వాళ్ళను, వీళ్ళను కాదు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయండంటూ బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరారు. సమస్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాని ఆయన్ను వదిలేసి ఆయన చుట్టున్న నేతలను సస్పెండ్ చేయడం నవ్వు తెప్పిస్తోంది. పోనీ.. పొంగులేటిని కన్విన్స్ చేసి పార్టీలోనే కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారా..?అంటే అది లేదు. ఆయనపై వేటు వేయడం మానేసి అనుచరులను టార్గెట్ చేస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ కాదు. ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్సీ కూడా కాదు. ఎలాంటి పదవి లేకుండానే ఉన్నారు. కాని పొంగులేటిపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం భయపడుతోంది. దీంతో సర్కార్ కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తోంది. ఆయనకు అసలు సభ్యత్వమే లేదని ప్రచారం చేస్తున్నారు.
గత నెలలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. హైకమాండ్ పెద్దలు పిలిపించుకొని మాట్లాడారు.అప్పుడు ఆయన్ను ఏ లెక్కన పిలిపించుకొని మాట్లాడారో పార్టీ పెద్దలకే తెలియాలి. అందుకే తన అనుచరులపై కాదు..తనను సస్పెండ్ చేయాలంటున్నారు.
బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలనుకుంటున్న పొంగులేటి ఇటీవల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తు సర్కార్ పై నేరుగానే విమర్శలు చేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్‌టీపీలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఓ వైపు బీజేపీ.. కాంగ్రెస్ ల నుంచి ఆఫర్లు ఆయన్ను ఊగిసలాటలో పడేలా చేస్తున్నాయి.
Also Read : కాంగ్రెస్ లోకి ఈటల , పొంగులేటి – ఫలించిన రేవంత్ మంత్రాంగం..!?