వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది.
శాఖల వారీగా కేటాయింపులు
–షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
–పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
–నీటి పారుదల రంగంకు రూ. 26,885 కోట్లు,
–వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు
–విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
–దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
–గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15, 233
–విద్యుత్ రంగం రూ. 12,727 కోట్లు
–ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు
–వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
–పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
–హోంశాఖకు రూ.9,599 కోట్లు
–రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
–బీసీ సంక్షేమం రూ. 6,229 కోట్లు
–ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
–కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
–హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
–రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
–పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
–మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
–మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
–రైతు బంధు పథకంకు రూ. 1,575 కోట్లు
–రైతు బీమా పథకంకు రూ. 1,589 కోట్లు
–ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు
–కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంకు రూ. 200 కోట్లు