ఇందిరాగాంధీ ఎమర్జెన్సి విధించాకా పార్లమెంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆమెపై కఠన చర్యలు తీసుకోవాలని సభ దద్దరిల్లింది. ఆమెను కాదు, రాజారామ్మోహన్ రాయ్ ను ఉరితీయాలని ఓ ఎంపీ వాదించాడు. ఎప్పుడో చనిపోయిన ఆయనకు, ఈ కేసుకు సంబంధం ఏమిటని అందరు అడిగారు. విధవరాళ్లు ఇంట్లో కూర్చోకుండా రాజకియాల్లోకి రావచ్చని ఆయన సంస్కరణలు చేశాడు కాబట్టే ఇందిరమ్మ రాజకీయాల్లోకి వచ్చారని వాదించాడు. అలా వుంది మన మంత్రి హరీష్ రావు తీరు.
సిద్దిపేటలో రైతులను ఆదుకుంటూ, వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తూ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నవాడు చక్రధర్ గౌడ్. సిద్దిపేటను మోనార్క్ లా ఏలుతున్నహరీష్ రావుకు అది నచ్చలేదు. నచ్చదు కూడా. ఎందుకంటే మొక్క వృక్షంలా ఎదగకముందే కలుపుమొక్కలా పీకేయడం హరీష్ రావుకు మొదటి నుంచి అలవాటు. అందుకే దేశంలోనే అత్యదిక ఓట్ల మెజారితో గెలుస్తాడు. చక్రధర్ గౌడ్ ను అచ్చోసిన ఆంభోతులా ఎలా చూపాలని కాచుకున్నాడు. సరిగ్గా అప్పుడే బెల్లం ముక్క లాంటి వార్త తెలిసింది. దొంగలు పడ్డ ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు జరగని రేప్ ని జరిగినట్లు ఆరోపిస్తు మూడురోజుల తర్వాత చక్రధర్ గౌడ్ ని చట్టం చంకలో ఇరికించాడు.
ఈకేసును నమ్మడానికి చాలా అనుమానాలు అడ్డొస్తున్నాయి. మొదట ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు మహిళా భర్త నిరాకరించడం బట్టి రాజకీయ ఒత్తిళ్ళతోనే ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఆ మహిళ భర్త, చక్రధర్ గౌడ్ మంచి స్నేహితులు. కలిసి మందుకొట్టేంత చనువుంది. ఎప్పటిలా ఆ ఇద్దరు మందు తాగారు. ఆమైకంలో చక్రధర్ గౌడ్ ఆమెపై అత్యాచారయత్నం చేశాడనేది ఆరోపణ. నిజంగా అత్యాచారయత్నం జరిగితే ఆ మహిళ భర్త ఊరుకుంటాడా..?నెత్తురుతాగడా? మరీ అంత చీమునెత్తురు లేని మగాళ్లు తెలంగాణాలో ఉన్నారా..?
Also Read : హరీష్ రావు కుట్రకు బలైన చక్రధర్ గౌడ్..?
తాగిన మైకంలో మిస్ బిహేవ్ చేశాడు.. కాబట్టి చక్రధర్ గౌడ్ ను మహిళా భర్త పెద్ద మనసుతో క్షమించాడు. తన భార్య కూడా అల్లరి పాలు కాకూడదనుకున్నాడు. ఇది తెలుసుకున్న హరీష్ రావుకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయ్యింది. ఈ సంఘటన జరిగిన మూడు రోజులకు ఆదంపతులను నయాన్నో, భయాన్నో లొంగదీసుకుని మానభంగం కేసు పెట్టించాడు.దున్నపోతుల కుమ్ములాటలో లేగ దూడ కాళ్లు విరిగినట్లు ఈ రాజకీయ కుట్రలో ఓ ఇల్లాలు పరువు బజారుకి ఈడ్చారు. ఆ భర్తను తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. చక్రధర్ గౌడ్ రాజకీయ భవిష్యత్తును ఆదిలోనే అణచివేస్తున్నారు. మహిళల సంకేమమే మాప్రధాన అజెండాఅని గొంతెత్తి చాటే బి.ఆర్.ఎస్ పార్టీ ఓమహిళను నడిరోడ్డుకు ఈడ్చిన ఈ ఉదంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
Also Read : రేప్ కేసులో రైతు బందావుడు చక్రధర్ గౌడ్ అరెస్ట్..రాజకీయ కుట్రేనా..?