తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చటే ఇప్పుడు హాట్ టాపిక్. రాజకీయ వర్గాల్లో ఈ అంశం చుట్టే చర్చంతా జరుగుతోంది. ముందస్తుకు వెళ్ళే ముచ్చటే లేదని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పేశారు కాని జరుగుతోన్న పరిణామాలు మాత్రం ముందస్తు ఎన్నికలకు సర్కార్ సిద్దమైందనే అనుమానాలు కల్గిస్తున్నాయి.
బీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీలు ముందస్తు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ఎన్నికలు ఎఎప్పుడొచ్చినా అధికారం మాదంటే మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపోటములు ఎలా ఉన్నా.. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ కొంగ్రెస్ సీనియర్ నేత , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల చివరాఖరలో తెలంగాణ అసెంబ్లీ రద్దు అవుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే.. కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ ముందస్తుకు ఎన్నికలకు కేంద్రం సహకరించే అవకాశం లేదని ఆయన ఉద్దేశ్యం. అందుకే..తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం సూర్యాపేట జిల్లాలోని కోదాడలో హత్ సే హత్ జోడో కార్యక్రమంపై అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని.. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కొన్ని రోజుల వ్యవధిలోనే అంటే.. ఫిబ్రవరి నెలఖారు వరకు అసెంబ్లీని రద్దు అవుతుందని.. రాష్ట్రపతి పాలన వస్తుందన్నారు.
ఇకపోతే..ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఇవే తరహ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెల చివర్లో అసెంబ్లీని రద్దు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే ఉత్తమ్ కుమార్ కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ముందస్తు ఎన్నికలు తథ్యమని రేవంత్ చెప్తుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాష్ట్రపతి పాలన విధిస్తారని తెలిపారు.ఏదీ ఏమైనా.. ఫిబ్రవరి నెల చివర్లో అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం చాలా గట్టిగానే సాగుతోంది.
Also Read : కర్ణాటకతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు