‘రాజుగారు! మీమీసం ఎవరో కొరిగారు’ అనిచెబితే -నాకున్న వేలాది వెంట్రుకల్లోంచి మీసం పోతేముందిలే ` పోయింది బొచ్చేకదా’ అన్నాడంటా. అలా ఉంది మన దేశప్రదాని మోడి మాటతీరు. ఆయన చెప్పలేక ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ చేత డబ్బింగ్ చెప్పించాడు. ఆరులోంచి ఆరు తీస్తే మిగిలేవి పదహారు అని లెక్కలు చెప్పే ఆమె, ఇప్పటికి మనకు చేకూరిన నష్టం దేశ ఆర్థికవ్యవస్థలో కేవలం ఒకే ఒక్కశాతమని చావు కబురు చల్లగా చెపుతున్నారు. అదాని సంస్థ వల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం దాదాపు ఎనిమిది లక్షల కోట్లరూపాయలని కేంద్రప్రభుత్వమేస్వయంగా ఒప్పుకుంది. అంటే అది దాదాపు ఎనిమిది రాష్ట్రాల వార్షిక బడ్జెట్తో సమానం. అయినా కేంద్రానికి చీమ కుట్టినట్లు లేదు. పైగా దానిని సమర్థించుకుంటు అదాని గ్రూప్ ను వెనకేసుకొస్తోంది. కారణంఆ సంస్థ బిజెపికి అఫ్లియేటెడ్ సంస్థ కాబట్టి.
ఇంకా పచ్చిగాచెప్పాలంటే నిండు సభలో వస్త్రాపహరణం జరిగాకా ద్రౌపది వెక్కి వెక్కిఏడ్చింది. దుర్యోధనుడి మీద ప్రేమ చావని దృతరాష్ట్రుడు ఆమెనుఓదార్చుతూ ‘‘అప్పుడే ఎందుకు ఏడుస్తావు తల్లీ? నీ బట్టలు వొలిచాడే కానీ నిన్ను ఇంకా చెరచలేదుగా. చెరిచాక తనివి తీరాఏడువు’’ అన్నాడట. జరిగిన నష్టాన్నికి కేంద్రప్రభుత్వం దేశాన్నిసరిగ్గా అలాగే ఓదార్చుతోంది. షేర్ మార్కెట్ వ్యాపారం కరోనా వైరస్ కంటే భయంకరమైనది. ఒక సంస్థ కుప్పకూలితే దాని అనుబంద సంస్థలు, దానితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబందాలుండే సంస్థలు కూడా కుప్పగా కూలుతాయి. ఎందుకంటే అది పేకముక్కలతో కట్టే కమర్షియెల్ కాంప్లెక్స్ లాంటిది.
లాభాల కంటే నష్టాలే ఎక్కువుంటాయి. నిజాయితిగా పని చేసేసంస్థలో మదుపరులు తమ డబ్బు పెట్టరు సరికదా ఉన్న మదుపరులు తమషేర్లు అమ్మెసుకుని బతుకుజీవుడా అని పారిపోతారు.అందుకే అదాని గ్రూప్లాంటి సంస్థలల్లో పెట్టుబడులు పెట్టడానికి మదుపరులు పరుగులు పెట్టారు. ఆనష్టం ఇప్పుడు కనిపించదు. కొన్నిరోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ కొడుతుంది. దానిభారం మన మీదే పడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే కేంద్రం ఎల్.ఐ.సి ని ప్రయివేట్ పరం చేసి కొన్నికోట్ల మంది పాలసీదారులను నడిరోడ్డుమీద నిలుచోబెట్టింది. దానికితోడు అదాని వల్ల దాదాపు 27 వేలకోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఇది కేంద్రం పెట్టుబడిలో కేవలం 0.08 శాతమని నిర్మలమ్మ మురిసిపోతున్నారు. కానీ ఆడబ్బు నష్టం వల్ల కొన్ని లక్షల మంది పాలసీదారులు నష్టపోయారు. వాళ్లను ఎలా ఆదుకుంటారో భరోసా ఇవ్వలేదు. పైగా తగలబడుతున్న ఆర్థికనష్టాన్ని ఎలా ఆర్పాలో ఆలోచించడంలేదు. కానీ ‘అదాని’గ్రూప్ని కాపాడుకుని తమ పరువును ఎలా పెంచుకోవాలో యోచిస్తోంది.
ఎందుకంటే బి.జె.పి ఎంపీలకు వేలాదికోట్ల రూపాయలు ఇచ్చిగెలిపించింది ఆసంస్థనే అన్నది అందరికీ తెలిసిన టాప్ సీక్రేట్. దీనికి మించిన మరో దారుణం ఏమిటంటే ఇంత జరుగుతున్నా కెసిఆర్ లేదా కెటిఆర్ ఇప్పటివరకు నోరు మెదపకపోవడం. ఈదారిణాన్ని ఖండిచకపోవడం .ఇళ్లు తగలబడిపోతున్నా ఫైరింజన్కి పోన్ చేయకపోవడం. రోజంతా బి.జె.పి మీద దుమ్మెత్తి పోసే కెసిఆర్ ఎప్పటిలాగే ఎల్.ఐ.సిని ప్రయివేట్ పరం చేయరాదని మోడిని దుమ్మెత్తిపోశాడు. కొంపలంటుకుంటాయని గగ్గోలుపెట్టాడు. మంచిదే. కానీ కెసిఆర్లాంటి ప్రతిపక్షాలనోళ్లు ఎలామూయించాలో అదాని గ్రూప్ లాంటి సంస్థలకు బాగాతెలుసు. అందుకే బిఆర్ఎస్కు మా కంపెని ఆర్థిక అండదండలు ఉంటాయిని అభయమిచ్చి నోళ్లు మూయిస్థాయి. అదాని గ్రూప్ లాంటి సంస్థల ఆర్థిక సహాయం లేకుండా అవకాశావాద పార్టీలు మనుగడ కొనగించలేవు. అందుకే నోరు వ ప్పడంలేదు. అందుకే ఇల్లు కాలిపోతున్నా కెసిఆర్ ఇంకాఫైరింజన్కి ఫొన్ చేయలేదు. ఇక్కడ ఎవరి అవసరాలువాళ్లవి. ఎవరిస్వార్థంవాళ్లది. ప్రజల సంక్షేమం ఎవడికికావాలి?
మరో విచిత్రకమైన పరిస్థితిఏమిటంటే దీనిమీద పార్లమెంట్లో రచ్చజరిగింది. బిఆర్ఎస్ మినహా, కొన్నిప్రతిపక్షాలు బాగానే రచ్చచేశాయి. అయితేపార్లమెంట్ సాక్షిగా సభాద్యక్షుడు పలికిన చిలపలుకు అందర్నీఆశ్చర్యపరిచాయి. అదాని గ్రూప్ మీద హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ కుట్రపూరితమైనవనీ, దానిని నమ్మాల్సిన అవసరంలేదని బోనాఫైడ్ సర్టిఫికెట్ ఇవ్వడానికిప్రయత్నించడం.మన దేశానికి చెందిన సంస్థలు అలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చాయంటే నమ్మవచ్చు. కానీ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ తప్పుడు రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలా ఇస్తేవాళ్లకు ఒరిగే ప్రయోజమంఏముంది? అందులోఏమాత్రం తప్పున్నా అదానిగ్రూప్ పరువు దావా నష్టంవేస్తుందని వాళ్లకుతెలియదా? లోగడ ఆసంస్థ ఇచ్చిన రిపోర్ట్లు నిజమని రుజువుకాలేదా? రోగంముదిరి రోగి చస్తేల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్లను నిందించినట్లు మనం చేసే తప్పులను పక్కదేశం వాడికిపులమడం ఎంతవరకు సమంజసమో సజ్జనులు ఆలోచించాలి.
Also Read : అయ్యో అదాని … పెయిడ్ బ్యాచ్ తో దొరికిపోయావ్ గా…!