‘ఆలిండియా అడుక్కుతినే వాళ్ల మహాసభలు’ అనగానే తాపీ ధర్మారావు రాసిన పుస్తకం గుర్తుకొస్తోంది కదూ! 50 ఏళ్లకిందట ఆమహానుభావుడు ఊహించి రాసిందే నేడు జరిగింది. అవును! మొన్న ముంబాయ్ లోని ఓమురికివాడలో దేశంలోని బిచ్చగాళ్లందరూ ఓమీటింగ్ పెట్టుకుని తమ డిమాండ్ల గురించి చర్చించారు. లవర్స్ డే, ఇండిపెండెన్స్ డేలాగా ‘బెగ్గర్స్ డే’ని నిర్ణయించినా ఆశ్చర్యంలేదు.
నేడు అడుక్కుతినే వాడే అదిక సంపన్నుడు అంటే అతిశయోక్తిలేదు. అలా ఉంది వాళ్ల సంపాదన. యాచించడం కూడా ఓ ఉద్యోగంలా మారింది. కేవలం హైదరాబాద్ లోనే దాదాపు పదహారువేల మంది బిచ్చగాళ్లు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇది పచ్చి నిజమని ఆమధ్య ఓసర్వేలో తేలింది. ఇందులో 90 శాతం వరకు పేద రైతులు. ఉళ్లలో సరిగ్గా పనులు దొరకకా, దొరికినా కుటుంబాన్ని సాకలేక నగరానికి అడుక్కోడానికి వస్తున్నారు. సగటుబిచ్చగాడి సంపాదన రోజుకు దాదాపు నాలుగు వందల నుంచి వెయ్యిరూపాయల వరకు ఉంటుంది.
సిగ్నల్స్ దగ్గర, గుళ్లముందు, మజీదుల ముందు, చర్చిల ముందు అడుక్కోవడం వీరి అడ్డాలు. పండగలకు, పబ్బాలకు వీళ్ల సంపాదన నాలుగు రెట్లు పెరుగుతుంది. చాలామందికి బ్యాంక్ అకౌంట్లు, పోస్టాఫీసుల్లో ఫిక్స్ డిపాజిట్లు ఉంటాయి. ఆ సంపాదనతో వాళ్లు ఎలా బతుకుతారనే సందేహం మీకు రావచ్చు. మనకంటే దర్జాగా బతికేస్తారు. వీళ్లకు ఇన్కామే తప్పా ఇన్కామ్ టాక్స్ కట్టేబెడదలేదు. ఇంటికి రెంట్, కరెంట్ ఉండదు. గుడిశెకు ఫ్యానుండదు, ఎసి అవసరం రాదు. కొందరు సెల్వాడితే, మరి కొందరు గుడిశెలల్లో కలర్ టివిలువాడతారు
వీళ్లల్లో క్లాస్ బిచ్చగాళ్లు వేరు. వీళ్లు గంగిరెద్దును ఊరేగించి, సన్నాయి వాయిస్తు, కిందపంచే, పైనసూట్ వేసుకుని దర్జాగా అడుక్కుంటారు. వీళ్లను హరిదాసులుగా కొందరు భావిస్తారు. సంక్రాంతి లాంటి పండగలకు సీజనల్‌గా అడుక్కుంటారు. ఏడాదిలో కేవలం నాలుగు నెలలు అడ్డుక్కుని, ఆడబ్బును వడ్డీలకు తిప్పుతూ ఏడాదంతా బతుకుతారు. ఇందులో వికలాంగుల హోదానే వేరు. వీల్ చేర్లో కూర్చుని కూరగాయలు అమ్మినట్లు మినీ మైక్‌లో రికార్డెడ్ సౌండ్‌తో అడుక్కుంటారు. మరికొందరు బిచ్చగాళ్లు సన్యాసులు, బాబలు, ఫఖీర్ల వేశాలు వేసి దర్జాగా అడుక్కుంటారు. వీళ్ళసంపాదనఏడాదికి ఆరెడు లక్షలల్లో ఉంటుంది. చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.
కొందరుబి చ్చగాళ్లు నిరుపేదల పిల్లలను అద్దెకు తీసుకుంటారు. వాళ్లను చంకనేసుకుని చైల్డ్ సెంటిమెంట్‌తో అడుక్కుటారు. చీకటి పడగానే ఆ పిల్లలతోపాటు రెండు వందలు చెల్లిస్తారు. మరికొందరు పిల్లలను ఎత్తుకొస్తారు. కొందరు బిచ్చమెత్తుకోడానికే పిల్లల్ని కంటారంటే అతిశయోక్తికాదు. ఆడవాళ్లలో చాలావరకు పార్ట్‌టైమ్‌లో పడుపు వృత్తి చేస్తారు. వీళ్లకు పర్మినెంట్ భర్తలంటూ ఉండరు. ఎప్పటికప్పుడు మొగుళ్లను మారుస్తారు. ఇది సంచార జాతుల నుంచి సంక్రమించిన సంస్కృతి. అమెరికాలంటి అభివృద్దిచెందిన దేశాల్లో స్త్రీ ఎంత స్వేచ్చగా భర్తలను వదిలేస్తారో, అంతే స్వేచ్చగా వీళ్లు భర్తలను వదిలించుకుంటారు. మగాళ్లతో సమానంగా తాగి తూలుతారు. మనదేశంలో స్త్రీ స్వేచ్చ కేవలం వీళ్లలోనే కనిపిస్తుంది.
తరాలు మారినాతరగని ఈవ్యవస్థ గురించి ఓపిట్టకథ ఉంది. ఓబిచ్చగాడు చాలాకాలంగా రాముడిగుడి ముందు అడుక్కుతింటున్నాడు. రాముడికి అతని మీద జాలేసింది. రాముడు ప్రత్యక్షమయ్యి కోటివరాహాలు ఇచ్చి మంచి వ్యాపారం చేసుకుని దర్జగా బతకమన్నాడు. ఆడబ్బుతో బిచ్చగాడు మరో రాముడి గుడి కట్టింటి మళ్లీ అడుక్కోసాగాడు. రాముడికి ఒళ్లుమండి‘వ్యాపారం చేసుకొమ్మంటే మళ్లీ అడుక్కుంటావేంటిరా?’అని అడిగాడు. అడుక్కోవడానికి మించిన లాభసాటి వ్యాపారం మరోటిలేదు స్వామి అన్నాడు.