వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం జగన్ సైతం సీబీఐ నోటిసులు అందుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ , ఆయన భార్య భారతి ఫోన్లు అటెండ్ చేసే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను సీబీఐ విచారించడంతో త్వరలోనే జగన్ కు సీబీఐ నోటిసులు జారీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసులో జగన్ ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్ చేయడం ఇందులో భాగమనే అనుమానాలు కల్గుతున్నాయి. ఇదేదో కుట్ర అన్నట్లుగా సజ్జల స్టేట్ మెంట్ ఇవ్వడం పలు అనుమానాలను లేవనెత్తుతోంది. జగన్ కు వ్యతిరేకంగా ఏం జరిగినా అదంతా కుట్ర అనడం వైసీపీకి పరిపాటి అని చెప్పనక్కర్లేదు.
వివేకా హత్యకేసులో చంద్రబాబు ముద్దాయి అని మొదట ప్రచారం చేశారు. ఆ తరువాత వివేకా కూతురు, అల్లుడే చంపించారని కూడా ఆరోపించారు. ఇప్పుడు కేసును సీబీఐ సీరియస్ తీసుకుంది. అసలు సూతదారులు ఎవరు..? పాత్రదారులెవరో తేల్చే పనిలో పడింది సీబీఐ. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి ఊహించని రియాక్షన్స్ వస్తున్నాయి. జగన్ ను ఇరికించే కుట్ర జరుగుతుందంటూ జగన్ ఆత్మగా చెప్పుకునే సజ్జల కామెంట్స్ చేశారు.
జగన్ ఇరకాటంలో పడే సమయంలో ఎలాంటి ప్రచారం చేయాలో సజ్జల డైరక్షన్ ఇస్తుంటారు. వివేకా హత్యకేసులో జగన్ కు నోటిసులు వస్తే దాని కుట్ర అని ముందే చెప్పామని.. మేము చెప్పినట్టుగానే జరిగిందని ప్రజలను నమ్మించేందుకు ముందుగా ఈ వాదనను సజ్జల వినిపించారన్నమాట.
సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుల్ని రక్షించడానికి అన్ని రకాల వ్యవస్థల్ని ఉపయోగించడం.. బెదిరించడం చేసినప్పుడే అసలు విషయం చాలా మందికి క్లారిటీకి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు సీబీఐ అందులో నిజాల్ని బయటపెడుతుందనే ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తున్నారు.