టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోల సరసన నటించింది అందాల నటి మీనా. టాలీవుడ్ , బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని మీనా గురించి ఫేక్ వార్తలు ప్రచురితం అవుతున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది.
నటి మీనా భర్త పలు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా తన కూతురితోనే ఉంటుంది. అయితే.. కూతురి భవిష్యత్ కోసం రెండో పెళ్లి చేసుకోవాలని మీనాపై ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని..దాంతో రెండో పెళ్లికి ఆమె కూడా అంగీకారం తెలిపిందని ప్రచారం జరిగింది.
వరుడు ఆమె చిన్న నాటి స్నేహితుడు అని.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అతను మీనాను పెళ్లి చేసుకునేందుకు ఒకే చెప్పాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత మీనా బంధువులను “పాలిట్రిక్స్” సంప్రదించగా.. అదంతా ఫేక్ అని తేలింది.
తాజాగా మరోసారి మీనా పెళ్లి గురించిన చర్చ తెరపైకి వచ్చింది. కోలీవుడ్ సినీ పరిశ్రమ కి చెందిన ఓ ప్రముఖ హీరో నటి మీనాని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొందరు బలంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఇప్పటికే ఆ హీరోకి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారట. కానీ ఇటీవలే తన భార్యతో మనస్పర్ధలు విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నట్లు సమాచారం. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆ హీరో ఆసక్తి చూపిస్తున్నాడని..ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించాడని అంటున్నారు. ఈ విషయమై ఆమె బంధువులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : తారకరత్న భార్యకు ఇదివరకే పెళ్లి అయిందా..?