మనిషి తనం చచ్చిపోతుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్యను ఓ కిరాతకుడు తెగనరికాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై సినిమా తరహాలో వెంటాడి భార్యను రోడ్డుపై హతమార్చాడు. ఈ సంఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశం నగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపైన భార్యను కిరాతకంగా చంపాడు భర్త. గత కొంతకాలంగా వీరి సంసారం వివాదాలతోనే సాగేది.
లంగర్ హౌస్ లో మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగంతో ఏడు సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.
ఈ క్రమంలోనే ఆమెపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను చంపాలనుకున్నాడు. శక్రవారం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఐరన్ రాడ్డుతో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనతో అక్కడున్న వారు హతశయులయ్యారు. స్థానికులు పట్టుకొని నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ ను సేకరిస్తున్నారు.