గతేడాది వేయి మంది ఉద్యోగులను తొలగించిన ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ తాజాగా మరో పదిహేను వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. గతంలో వేయి మంది ఉద్యోగులను తొలగించిన సమయంలో బైజూస్ చీఫ్ రవిచంద్రన్ ఓ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు అనివార్యంగా మారిందని..ఇక ఉద్యోగుల తొలగింపు ఉండబోదని స్పష్టం చేశారు కాని తాజాగా ఆ ప్రామిస్ ను బ్రేక్ చేశారు.
బైజూస్ఇటీవలి కాలంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. యూనికార్న్ స్టార్టప్ గా ఎదిగిన తరువాత పూర్తిగా దారి తప్పిదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రకటిస్తూ.. ఉద్యోగులను తొలగిస్తోంది. నష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు విద్యార్థుల తల్లిదంద్రులను వేదిస్తుందన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ క్రమంలోనే కరోనా టైంలో అందరూ ఆన్ లైన్ చదువులపై ఆసక్తి చూపడంతో బైజూస్ బిజినెస్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి పీకలదాక చేరింది. అందుకే నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోంది.
బైజూస్ కంటెంట్ క్వాలిటీపై కూడా నమ్మకం కుదరక వినియోగదారులు కూడా తగ్గిపోయారు. అప్పులు పెరిగిపోవడం… నష్టాలు రావడంతో బైజూస్ పై ఒత్తిడి అధికం అయింది. ఈ సమయంలో మరోమారు ఉద్యోగులను తొలగించుకొని రిలీఫ్ పొందటం మినహా బైజూస్ కు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఏదీ ఏమైనా.. బైజూస్ తీవ్ర సంక్షోభంలో ఉందన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
Also Read : ఊడుతున్న ఉద్యోగాలు – అమెరికాలో భారతీయుల వెతలు