ఎదో సినిమాలో ఎప్పుడు వస్తానో నాకే తెలియదు…ఏం మాట్లాడుతానో కూడా తెలియదు అనే డైలాగ్ ఉంటుంది. చాలా ఫేమస్ డైలాగ్ . ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ కు ఈ డైలాగ్ అచ్చు గుద్దినట్లు సరిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటారా..సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తె ఇది నిజమనే అనిపిస్తుంది.
శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు తాను వెళ్తానంటే వద్దన్నారని ఆయన మండిపడ్డారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని… అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు.
ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా గెలవలేరని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజున కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని… తనను తెలంగాణ నుంచి బహిష్కరిద్దామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
కేఏ పాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సచివాలయం జరిగిన అగ్నిప్రమాదం ఎవరు చేసిందో కాదు.. కేఏ పాల్ పనేనని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.