వీఆర్ఎస్ తీసుకొని బీఆర్ఎస్ లో చేరిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐటీ గుప్పిట్లో చిక్కుకున్నారు. ఆయన నివాసంలో నాలుగు రోజుల నుంచి వరుసగా ఐటీ అధికారులు కంటిన్యూగా సోదాలు చేస్తున్నారు. ఏదో మతలబు లేకపోతే ఐటీ అధికారులు వరుసపెట్టి సోదాలు నిర్వహించరు.
ఆయన కలెక్టర్ గా కొనసాగిన సమయంలోనే వెంకట్రామి రెడ్డిపై రాజకీయపరమైన విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నలో పని చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడే కేసీఆర్ కు పాదాభివందనం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.కేసీఆర్ తో మొదటి నుంచి వెంకట్రామిరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. ఆయన అండతోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
వెంకట్రామి రెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడే ఆయన కుటుంబం రాజపుష్ప పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించారు. లగ్జరీ అపార్టుమెంట్లు, విల్లాలు అమ్మడం వంటివి చేశారు. ప్రభుత్వ పెద్దలకు ఆయన బినామీ అని..ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు పొందారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అయినా ఏనాడూ ఐటీ అధికారులు వెంకట్రామిరెడ్డి వ్యాపారంపై ఫోకస్ చేయలేదు.
సడెన్ గా ఐటీ అధికారులు వెంకట్రామిరెడ్డి నివాసంలో సోదాలు స్టార్ట్ చేశారు. వరుసగా నాలుగో రోజు సోదాలు జరుగుతున్నాయి. రాజపుష్ప ప్రాపర్టీస్ తో పాటు వెర్టెక్స్, ముప్పా రియల్ ఎస్టేట్ , వసుధ ఫార్మా ఇలా కొన్ని కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించారు. ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సన్నిహితంగానే ఉండటంతో.. ఈ ఐటీ దాడుల్లో రాజకీయ కోణం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు.
Also Read : MLC వెంకట్రామి రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..!