తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైయిన అధికారులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసి రప్పించారు. సకాలంలో స్పందించడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది. అయితే ఆ భవనంలో వుడ్ వర్క్ చేస్తుండగా షాట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించి వుండొచ్చు అంటున్నారు అధికారులు.
ఈ నెల 17న సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నూతన సెక్రటేరియట్ ను ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే స్పందిస్తూ.. ఇది ఎవరైనా కావాలనే చేశారా..?లేక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న వాటిపై అధికారులు విచారణ జరపాలని కేసీఆర్ ఆదేశించారు.
సచివాలయంలో మంటలు చెలరేగడంతో అక్కడి స్థానికులు కూడా ఆందోళన చెందారు.ఈ ఘటన పై ప్రభుత్వం విచారణ జరపనుంది.