14ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు మేనమామ వరుసయ్యే కామాంధుడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక యత్నించగా నోట్లో యాసిడ్ పోసి దారుణంగా ప్రవర్తించాడు. ఐదు నెలలపాటు చావు -బ్రతుకుల మధ్య పోరాడిన ఆ చిట్టి తల్లి మృత్యువును ఓడించలేక.. ఈ లోకాన్ని వదిలివెళ్ళింది. మనస్సును మెలితిప్పే ఈ విషాదకర సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఈ గ్రామానికి ఓ మాజీ ఉపాధ్యాయుడికి తొలుత కుమారుడు పుట్టాడు. 18ఏళ్ల వయస్సులో అతను మృతి చెందాడు. ఆ తరువాత చాలా కాలానికి కుమార్తె పుట్టింది. దాంతో కుమార్తెను అపురూపంగా పెంచుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు. తనే లోకంగా బ్రతుకుతున్నాడు. తన కూతురికి చిన్న ప్రమాదం జరిగినా గుండెలవిసేలా తల్లడిల్లెవాడు ఆ తండ్రి. ఈ క్రమంలోనే అనుకోని సంఘటన ఆ తండ్రికి కూతురిని లేకుండా చేసింది. ఓ కామాంధుడి ఆకలికి అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ చిట్టితల్లి బలైంది.
గత యేడాది సెప్టెంబరు 5వ తేదీన బాలిక కుటుంబ సభ్యులు నెల్లూరుకు వెళ్లగా, బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉంది. ఇదే అదునుగా భావించిన మేనమామ వరుసయ్యే కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు బాలిక మరుగుదొడ్డిలోకి వెళ్లి దాక్కుంది. అయినా వదిలిపెట్టలేదు. వద్దు మామయ్యా.. నన్ను వదిలేయ్ అని ప్రాధేయపడింది. కానీ అవన్నీ అతని గుండెను కరిగించలేదు. సరికదా మరింత రెచ్చిపోయాడు.
తలుపులు పగులగొట్టి చిన్నారి కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్‌ను నోట్లో పోశాడు. దీంతో బాలిక విలవిల్లాడింది. బ్రతికుండగానే చావును చూసేసింది. యాసిడ్ గాయాలకు భరించరాని నొప్పితో బాలిక ఐదు నెలలపాటు మృత్యువుతో పోరాడి ఓడింది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఐదు నెలలపాటు చికిత్స అందించారు.
ప్రాస్టిక్ సర్జరీ చేసి ముఖాన్ని పాత స్థితికి తెస్తామని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. కానీ, వారి కలలు ఆవిరయ్యాయి. బాధితురాలు మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ విషయంపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు.అపురూపంగా పెంచుకున్న కూతురు కామందుడి ధాటికి బలికావడంతో ఆ తండ్రి కన్నీటిని ఆపడం ఎవరి తరం కావడం లేదు.
Also Read : మతం మారాలంటూ మహిళపై గ్యాంగ్ రేప్…!