నందమూరి తారకరత్న ఆరోగ్యం కాస్త కుదుటపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అటు నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.
టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు బెంగళూర్ లో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించి వెళ్తున్నారు. అయితే తారకరత్న గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎదో ఒక కథనం ప్రచారం అవుతూనే ఉంది. ఇటీవల ఆయన చివరి కోరిక గురించి ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది.
బాలయ్య అంటే తారకరత్నకు బాగా ఇష్టం. తన తండ్రి కంటే కూడా బాలకృష్ణను ఎక్కువ ఇష్టపడుతాడు. బాలయ్య కూడా అదే రీతిలో తారకరత్నను సొంత కొడుకులా ట్రీట్ చేస్తాడు.
తారకరత్నకు గుండెపోటు వచ్చిందని తెలియగానే బాలకృష్ణ తనకున్న పనులను పక్కన పెట్టేశారు. బెంగళూర్ లోనే మకాం వేసి తారక రత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. పక్కనుండి అన్ని సేవలు చేస్తున్నారు.
దీనిని బట్టి బాలయ్య కి తారకరత్న అంటే ఎంత ప్రేమ ఉందొ అర్థం చేసుకోవచ్చు.అయితే తారకరత్నకి చివరి కోరిక ఏమిటంటే బాలకృష్ణ తో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలి అని.
ఇన్నేళ్లు ఇండస్ట్రీ లో ఉన్నా బాలయ్య తో కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేకపోయానే అని బాధ తారకరత్న లో ఉండేదట..ఈ విషయాన్నీ ఆయనే పలు ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు..మరి తారకరత్న పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత అతనితో కలిసి బాలయ్య ఒక సినిమా చేస్తాడో లేదో చూడాలి.
Also Read : తారకరత్న భార్యకు ఇదివరకే పెళ్లి అయిందా..?