ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ చార్జీషీట్ లో ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేర్లను చేర్చింది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా రెడ్డిలు సహా 17మంది నిందితులపై ఈడీ అభియోగాలను మోపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులను గుజరాత్ ఎన్నికల కోసం ఆప్ వాడిందని ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసిన కవిత పేరును కూడా తాజా చార్జీషీట్ లో చేర్చింది. ఇకపోతే.. తాజాగా ఈడీ చార్జీషీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చడంపై ఆయన స్పందించారు.
అవినీతికి వ్యతిరేకంగా పని చేయాల్సిన ఈడీ.. అవినీతికి పాల్పడుతున్న వారిని ప్రశ్నిస్తోన్న వారిని వేధించి.. ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ చార్జీషీట్ అంత ఓ కల్పితమని మండిపడ్డారు.
మొత్తం 428పేజీలతో ఈడీ రెండో చార్జీషీట్ ను రిలీజ్ చేసింది.ఈ చార్జీషీట్ లో ముఖ్యమంత్రి పేరును చేర్చడం సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.