పేర్ని నాని.. కొడాలి నాని.. ఈ ఇద్దరు సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు. జగన్ పై ఈగ వాలనీయకుండా చూసుకుంటారు. ప్రతిపక్షం నుంచి జగన్ పై విమర్శలు రాగానే కౌంటర్లు వేసేది ఈ నానిలే. ప్రత్యేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై చెలరేగిపోవడం ఈ నేతల బాధ్యత.
జగన్ తో అత్యంత సన్నిహిత నేతలుగానున్న వీరికి ప్రభుత్వంలో లభించే ప్రాధాన్యత మాత్రం క్రమక్రమంగా సన్నగిల్లుతూ వస్తోంది. జగన్ కు పెద్ద పాలేర్లమని సిగ్గు విడిచి చెప్పుకుంటున్నారు కాని..ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోవడంతో ఈ నేతల్లో ఖచ్చితంగా అసంతృప్తి గూడుకట్టుకొని ఉండి ఉంటుంది.
గత ఏడాది ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో కొడాలి నాని, పేర్ని నానిలను తొలగించరని అంత అనుకున్నారు. కాని వీరిని పక్కనపెట్టేశారు. ఇది వారిలో అసంతృప్తి కల్గించకుండా ఎలా ఉంటుంది..? తమను పక్కనపెట్టి తమకంటే గొప్ప నేతలని భావించి మంత్రివర్గంలోకి తీసుకున్న నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించకుండా, తమని పిలిచి మాట్లాడించడంపై వారు ఆగ్రహంగా ఉండకుండా ఎలా ఉంటారు..? పదవులు ఇతర నేతలకు కట్టబెట్టి..పంచాయితీల కోసం తమను వాడుకుంటారా అని వారిలో అసహనం ఉండకుండా ఎలా ఉంటుంది..? వారు కూడా మనుషులే కదా. వారు కూడా ఆశాజీవులే కదా. ఖచ్చితంగా వారిలో అసంతృప్తి ఉండి ఉంటుంది.
కొడాలి, పేర్ని నానిలలో వైసీపీపై అసంతృప్తి ఉండి ఉంటుంది. కాని మంత్రి పదవులో ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలు చేయడంతో వారు ప్రత్యర్ధి పార్టీలకు టార్గెట్ అయ్యారు. అలా వారు వైసీపీలోనే ఫిక్స్ కావాల్సిన సిట్యూయేషన్. గుండెలనిండా వైసీపీపై అసంతృప్తి ఉన్నప్పటికీ గత వ్యవహారశైలి ఆ నేతలను పక్కకు దాటకుండా చేస్తోంది. ఎన్ని అవమానాలు జరిగినా వైసీపీలో ఉండటం తప్ప వేరే మార్గం లేదు.
రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి విమర్శలు చేయడం వారిలో విమర్శలకు కారణం అవుతోంది. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో చెప్పలేం. కాని వారిలోని అసంతృప్తి ఎదో ఒక రోజు బయటపడక మానదు. ఆ రోజు జగన్ కు పొలిటికల్ డర్టీ పిక్చర్ చూపించడం ఖాయం.
Also Read : జగన్ మొద్దు నిద్ర – విశాఖకు కలగానే మిగిలిన మెట్రో