టాలీవుడ్ నటి కీర్తి సురేష్ విహాహం ఎప్పుడెప్పుడని ఆమె అభిమానులు ఆతృతతో ఉన్నారు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో కీర్తి పెళ్లి వార్తలు వైరలవుతున్నాయి. అయితే ప్రేమలో ఉన్న తన చిన్న నాటి ఫ్రెండ్ తో పెండ్లన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఇలా భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండగా ఒక్కసారిగా కీర్తి తల్లి మేనక తన కూతురి పెళ్ళి విషయంపై స్పందించారు. కీర్తి తన చిన్న నాటి స్నేహితుని పెండ్లడబోతుందన్ని వస్తున్న వార్తలు పుకార్లేనన్ని మేనక చెప్పుకొచ్చింది. మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని కుండబద్దలు కొట్టారు.
కీర్తి పెండ్లి ఇంకా ఎవ్వరితో ఫిక్స్ కాలేదన్నారు. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే స్వయంగా నేనే చెప్తానని చెప్పారు కీర్తి సురేష్ తల్లి మేనక. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు మంచిది కాదని కీర్తి ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉందన్నారు.దీంతో ఆమె పెళ్లి వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది.