బీజేపీ, బీఆర్ఎస్ లకు గట్టి షాక్ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రకారం ముందుకు సాగుతున్నారు టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీలోకి చేరికలను ముమ్మరం చేసేందుకు ఆయన అంతర్గతంగా నేతలతో చర్చిస్తునారు. ఈ విషయం బయటకు రాకుండా అత్యంత సీక్రెట్ గా బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొంతమంది నేతలకు తొందరపడొద్దని చెప్తున్నా రేవంత్.. మరికొంతమంది నేతలను మాత్రం ఉన్నపళంగా కాంగ్రెస్ లో చేరాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటల రాజేందర్ తోపాటు బీఆర్ఎస్ అసమ్మత్తి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు కోరం కనకయ్యతోపటు మరికొంతమంది నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు తెరవెనక రేవంత్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కోరం కనకయ్యలు కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపు ఒకే చెప్పగా.. ఈటల మాత్రం కాస్త డైలమాలో పడినట్లు సమాచారం. ఇప్పటికప్పుడు బీజేపీని వీడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి..? మరోసారి పార్టీ మారితే రాజకీయంగా క్రిడిబులిటిని కోల్పోతామా..? బీఆర్ఎస్ తనను అస్త్రంగా చేసుకొని కొత్త కేసులను ఏమైనా పెట్టిస్తుందా..? ఒకవేళ కేసులను పెడితే కాంగ్రెస్ లో ఉండి ఎదుర్కోవడం ఎలా..?పార్టీ నుంచి సహకారం ఎలా ఉంటుంది..? అనే అంశాలపై ఈటల సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కోవర్టులు ఉన్నారని భావిస్తోన్న ఈటల.. ఆ పార్టీలో ఉండి కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదని దాదాపు ఓ అంచనాకు వచ్చారు. దీంతో రేవంత్ తనదైన శైలిలో వ్యూహాత్మక రాజకీయం చేశారు.
ఈటల బీజేపీలో ఉంటె ఆయన అసలు లక్ష్యం.. కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదని పరోక్షంగా కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానం పంపారు. అదే సమయంలో మరికొంతమంది నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ లు సైతం కాంగ్రెస్ లోకి రావాలని సంకేతాలు పంపారు. వీరంతా బీజేపీలో ప్రాధాన్యత లేక కొనసాగుతున్న వారే. దీంతో వారిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తనదైన రాజకీయం చేశారు. ఈ క్రమంలోనే ఈటల ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే కౌంటర్లు పేలడంతో ఆయన పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్నారన్న చర్చ ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
Also Read : చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ లోకి పొంగులేటి..?
పార్టీ మార్పు విషయమై ఈటల ఇంకా డెసిషన్ తీసుకోలేదని కొంతమంది నేతలతో ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన సన్నిహితులు, అనుచరులతో మాట్లాడి నిర్ణయం వెలువరిస్తారని సమాచారం. అదే సమయంలో లో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు ఆయన్ని కాస్త వెనక్కి తోస్తున్నాయి. మరికొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీలో జోష్ ఉంటుందని భావిస్తోన్న ఈటల.. పొంగులేటితో కోరం కనకయ్యలతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.
ఏదీ ఏమైనా ఆయన పార్టీ వీడటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : ఈటలపై సొంత పార్టీ నేతల ఎదురుదాడి – బీజేపీని వీడక తప్పదా..?