సిద్దిపేట కలెక్టర్ గా కొనసాగుతూ..రాత్రికి రాత్రి ఎమ్మెల్సీ అయిన వెంకట్రామరెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు చేపట్టింది. అధికారిగా కొనసాగుతూనే…రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఆయన బిజినెస్ చేసేవారు. ఆ కంపెనీ పేరు రాజ్ పుష్ప. ఇపుడు అదే కంపెనీపై పెద్ద ఎత్తున దాడులు జరుతున్నాయి. ఆ కంపెనీతో సంబంధమున్న ఇతర సంస్థలపై దాడులు జరుగుతున్నాయి.
రాజ్ పుష్పతోపాటు వసుధ ఫార్మా, పలు కంపెనీలపై దాడులు జరుగుతున్నాయి. ఫార్మా పేరుతో రాని ఆదాయం చూపించి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.మొత్తంగా యాభై ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ట్యా క్స్ ఎగవేత కాదు ..బ్లాక్ మనీ కూడా బయటకు వస్తుందని అంటున్నారు.
కలెక్టర్ గా ఉంటూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గతంలోనే రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. విలువైన భూములను కలెక్టర్ కు ప్రభుత్వం కట్టబెట్టినదని ఆరోపించారు. ఆయన ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలకు బినామీ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల దర్యాప్తు సంస్థలు కాస్త సైలెంట్ అయ్యాయని అనుకుంటుండగానే ఈ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు చేపట్టింది.