ట్రాన్స్ జెండర్ లను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు అధికం అవుతున్నాయి. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ ను ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం కూడా పెట్టాడు. కాని కుటంబ సభ్యుల నుంచి ఆ జంట తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటుంది.
పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ కు చెందిన అర్జున్ అనే యువకుడికి రవి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకి దారి తీసింది. ఇద్దరు కలిసి జీవించాలనుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
తాము ఒక్కటిగా కలిసి జీవించేందుకు రవి అనే యువకుడు ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. తన పేరును మీన్ రియగా మార్చుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఓ పాపను కూడా దత్తత తీసుకొని ఆనందంగా గడుపుతున్నారు.
అర్జున్ – మీన్ రియాలను విడదీసేందుకు రియా కుటుంబం వారి మధ్యలోకి ప్రవేశించింది. పెళ్లి కోసం అమ్మాయిగా మరి పరువు తీశాడని రియాను వేధించడం స్టార్ట్ చేశారు. అర్జున్ ను కూడా చంపుతామని బెదిరింపులకు గురి చేశారు.
ఇటీవల భోగి పండుగ రోజు తన కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి తమను ఇష్టానుసారం తిట్టారని అర్జున్ ఆరోపించాడు.తమపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పాడు.