నిరుద్యోగులకు తపాలశాఖ అదిరిపోయే శుభవార్తను ప్రకటించింది. పదో తరగతి పూర్తైన వారందరూ పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. దేశవ్యాప్తంగా ఖాళీగానున్న 40వేల ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల ఎంపికకు ప్రత్యేకంగా రాత పరీక్ష ఏమి ఉండదు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపడుతారు. ఎంపికైనవారు ఆయ బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
రాష్ట్రాల వారీగా ఖాళీలు, వేతన వివరాలు
నలభై వేల ఉద్యోగాలకుగాను ఏపీలో 2480, తెలంగాణలో 1266, అసోం- 407, బిహార్- 1461, ఛత్తీస్‌గఢ్-1593, దిల్లీ – 46, గుజరాత్- 2017, హరియాణా- 354, హిమాచల్‌ప్రదేశ్- 603, జమ్ము కశ్మీర్- 300, ఝార్ఖండ్- 1590, కర్ణాటక- 3036, కేరళ- 2462, మధ్యప్రదేశ్- 1841, మహారాష్ట్ర- 2508, నార్త్ ఈస్టర్న్- 923, ఒడిశా- 1382, పంజాబ్- 766, రాజస్థాన్- 1684, తమిళనాడు- 3167, ఉత్తర ప్రదేశ్- 7987, ఉత్తరాఖండ్- 889, పశ్చిమ బెంగాల్- 2127 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది.
అదనంగా ఇండియన్ పోస్టల పేమెంట్ బ్యాంకుకు పనులకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ ఉంటాయి. వారు అందిచే సేవల ఆధారంగా ఇంటెన్సివ్ ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన వారు పోస్టాఫీసుకు దగ్గర్లో నివాసం కల్గి ఉండాలి. పోస్టును బట్టి వేతనం ఉంటుంది. రూ.10,000 – రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380, ఏబీపీఎ లేదా డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.
అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతిలో తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందులోనూ మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంగ్లీష్ తో పాటు తెలుగును పదో తరగతి వరకు ఓ సబ్జెక్టు గా ఉండాలి. కంప్యూటర్ అవగాహనతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
ఎంపిక విధానం:
పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన ఖాళీల వివరాలను అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అలా ప్రాధాన్యత ప్రకారం.. ఆప్షన్లు ఇస్తూ దరఖాసు నింపాలి. మార్కుల ఆధారంగా అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో బ్రాంచ్ లో పోస్టింగ్ కేటాయిస్తారు. పోస్టుకు ఎంపికైన వారికి ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అందుతుంది. ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేది: 16.02.2023