బీజేపీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయనను చిక్కులో పడేశాయి. సొంత పార్టీ నేతలే ఈటలపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో కొనసాగుతూ ఈవ్యాఖ్యలు చేయడం వలన జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈటల వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఈటలను ఎలాగైనా పార్టీలో బలహీనపరచాలని ఆయనకు వ్యతిరేకంగా కొంతమందిని ఎగదోస్తున్నారని చెబుతున్నారు. తాజాగా విజయశాంతి స్పందించారు. ఈటల పేరును ప్రస్తావించకుండా మాట్లాడారు. పార్టీలో కోవర్టులు ఉంటె వారెవరో.. పేర్లతో సహా బయట పెట్టాలి. అంతేకాని ఊరికే కోవర్టులున్నారని మాట్లాడితే ఎలా అంటూ ఈటలనుద్దేశించి ప్రశ్నించారు. ఇన్నాళ్ళు ఈటలకు మద్దతురాలిగా కొనసాగిన ఆమె తాజాగా రివర్స్ కావడం పార్టీలో అనేక సందేహాలను లేవనెత్తుతోంది.
ఇదే విషయమై బండి సంజయ్ కూడా స్పందించారు. బీజేపీ సిద్ధాంతం కల్గిన పార్టీ అని, తమ పార్టీలో ఎవరూ కోవర్టులు ఉండరని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కామెంట్స్ ఈటల వ్యాఖ్యలకు కౌంటరేనని చెప్పాల్సిన పనిలేదు. పార్టీలో కోవర్టులు ఉన్నారని ఈటల చెబితే..పిలిచి మాట్లాడాల్సిన నాయకత్వం కూడా ఇలా కౌంటర్ ఎటాక్ లు ప్రారంభించడం చర్చనీయాంశం అవుతోంది.
సొంత పార్టీలోనే ఎదురీత ఎదుర్కోవాల్సి వస్తుండటంతో ఈటల ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరే అవకాశం మెండుగానే ఉంది.
Also Read : కాంగ్రెస్ గూటికి ఈటల..?