ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదిక చుట్టే ఈ చర్చంతా సాగుతోంది. అదానీ గ్రూప్ అవకవతకలకు పాల్పడిందని 88ప్రశ్నలతో హిండెన్ బర్గ్ బయటపెట్టిన నివేదిక దెబ్బకు భారత షేర్ మార్కెట్లు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి.ఎన్నడు లేని విధంగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఏ న్యూస్ ఛానెల్ చూసినా, ఏ పేపర్ తిరిగేసినా, మార్కెట్లు నిపుణులు కలిసినా అంత ఒకటే చర్చ. హిండెన్ బర్గ్ నివేదిక గురించే. ఇంతకీ హిండెన్ బర్గ్ చరిత్ర ఏంటి..? దాని లక్ష్యమేంటి..? అది ఎవరి సారధ్యంలో నడుస్తుంది అనే అంశాలను ఈ కథనంలో చూద్దాం.
నాథన్ అండర్సన్
2017లో నాథన్ అండర్సన్ అనే వ్యక్తి హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థను స్థాపించాడు. న్యూయార్క్ కేంద్రంగా ఈ సంస్థ పని చేస్తోంది. అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో వాణిజ్యంపై డిగ్రీ పట్టా అందుకున్నాడు అండర్సన్. ఆ తరువాత జెరూసలేంలో అంబులెన్స్ డ్రైవర్ గా పని చేశారని టాక్. కాని చదువుకున్న చదువుకు చేస్తోన్న ఉద్యోగానికి పొంత లేదని భావించి మళ్ళీ అమెరికాకు తిరిగి వచ్చాడు అండర్సన్. అక్కడ ఫ్యాక్ట్ సెట్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసేవాడు. ఆ సమయంలో పెద్ద, పెద్ద కంపెనీలు ఎలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి..? అసలు వీటి కథేంటి..? అని తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దాంతో సీక్రెట్ ఆపరేషన్ చేయాలన్న ఆలోచనకు వచ్చాడు. ఆ ఆలోచన ఫలితమే హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు దారితీసింది.
లక్ష్యం :
ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలు చేస్తోన్న ఆర్ధిక మోసాలు, పన్ను ఎగవేతలను బయటపెట్టడం హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ లక్ష్యం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటివరకు 16కంపెనీల మోసాలను ప్రపంచం ముందుంచాడు. అందులో అమెరికాకు చెందిన కంపెనీ కూడా ఉంది. 2020లో నికోలా కార్పొరేషన్ మోసాలను హిండెన్ బర్గ్ బయటపెట్టడంతో దాని స్టాక్ విలువ 40శాతం నష్టపోయింది. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా టాప్ బిలియనీర్ గా ఎదిగిన అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ దృష్టి పడింది. అదానీ ఎలా ఎదిగాడన్న దానిపై రీసెర్చ్ చేసి నివేదిక రూపొందించింది.
అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం ఓ పేకమేడ అని.. అది ఎప్పుడైనా పేలిపోవచ్చునని హిండెన్ బర్గ్ నివేదికను బయటపెట్టింది. తమ నివేదిక అబద్దమైతే న్యాయస్థానాల్లో దావా వేసుకోవచ్చునని సవాల్ కూడా చేసింది. అదానీ గ్రూప్ షార్ట్ సెల్లింగ్ చేస్తోందన్నది. స్టాక్ మార్కెట్ లోని ప్రతి లావాదేవీలో ముందు కొనుగోలు చేయడం, తరువాత దాన్ని అమ్మడం, లేదా ముందు అమ్మడం, ఆ తరువాత కొనడం వంటివి అదానీ గ్రూప్ కు పరిపాటి అని ఆరోపణలు చేసింది. షేర్లను కొనుగోలు చేసి దాని విలువ పెరిగాక అమ్మి లాభం పొందవచ్చు.. అంటే షేర్లను తక్కువ ధరకు కొనడం, అనంతరం అధిక ధరకు అమ్మడం.. ఇది మంచి లాభాలనిస్తుంది. రెండో విధా నాన్నిఅదానీ గ్రూప్ అనుసరిస్తోందన్నది హిండెన్ బర్గ్ నివేదిక.
ఏదీ ఏమైనా నాథన్ అండర్సన్ దెబ్బకు అదానీ గ్రూప్ విలవిల్లాడుతోంది.
Also Read : బీజేపీ డైలాగ్ ను వాడేస్తోన్న అదానీ గ్రూప్..!