బడ్జెట్ ఫైల్ ను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం చివరికి వెనక్కి తగ్గింది. గవర్నర్ ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తామంటూ హైకోర్టుకు చెప్పి అత్యవసర పిటిషన్ ను ఉపసంహరించుకుంది.
ఫిబ్రవరి మూడో తేదీన అసెంబ్లీని సమావేశపరిచి.. అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బడ్జెట్ ఫైల్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. కాని గవర్నర్ మాత్రం తన ప్రసంగం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రగతి భవన్ కు లేఖ రాశారు. దీంతో బడ్జెట్ ఫైల్ ను గవర్నర్ ఆమోదించరని సర్కార్ డిసైడ్ అయింది. దాంతో కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
వాస్తవానికి.. ఇది హైకోర్టు విచారించే అంశం కాదు. రాజ్యాంగబద్దమైన పదవుల్లోనున్న వ్యక్తులను గవర్నర్ లను హైకోర్టులు ఆదేశించలేవు. అలాగే.. గవర్నర్ ప్రసంగం పెట్టాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించలేదు. అయినా వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఏ న్యాయసలహాదారు సలహ ఇచ్చారో కాని ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది.
పిటిషన్ పరిశీలన స్థాయిలోనే ఈ పిటిషన్ ను ఎలా విచారించగలమని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని ప్రభుత్వం తరుఫు న్యాయవాది దుష్యంత్ దవే చెప్పడంతో పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. వాదనల్లో ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు సూచనలు కనిపించడంతో వెంటనే సర్కార్ వెనక్కి తగ్గింది.
Also Read : పంతం వీడని గవర్నర్ – హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు నివేదించారు. అంతేకాదు.. గవర్నర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వానికి సూచిస్తానని చెప్పుకొచ్చారు. గవర్నర్ విషయంలో వెనక్కి తగ్గోదని భావించిన ప్రభుత్వం సడెన్ గా. పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం బీఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
Also Read : ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ – బీజేపీ ట్రాప్ లో బీఆర్ఎస్..?