బీఆర్ఎస్ లో కొత్త పంచాయితీ షురూ అయింది. కోరుట్ల, వరంగల్ , జనగామ మున్సిపాలిటీలు, పలు కార్పోరేషన్ లలో అధికార పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అసమ్మత్తి స్వరం వినిపిస్తున్నారు. పలు చోట్ల మున్సిపల్ చైర్ పర్సన్స్ పై సొంత పార్టీ నేతలే అవిశ్వాసానికి రెడీ అయ్యారు. పార్టీలో సైరన గౌరవం ఇవ్వడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధి పనులు కూడా చాలావరకు పెండింగ్ లో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జనగామ చైర్ పర్సన్ పోకల జమునపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి రెడీ అయ్యారు. 19వ వార్డు కౌన్సిలర్ బండ పద్మతో కలిసి మిగితా కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. 13మంది ఆమె క్యాంప్ లో ఉన్నారు. కౌన్సిలర్లు అందరూ తనకు మద్దతు తెలపాలని బండ పద్మ ఓ ఆలయంలో ప్రమాణం చేయించుకున్న ఫోటోలు లీక్ అయ్యాయి. సొంత పార్టీ నేతలతోపాటు ఇతర పార్టీ కౌన్సిలర్ల మద్దతు ఆమెకు ఉన్నట్లు తెలుస్తోంది.
వరంగల్ , కోరుట్ల మున్సిపాలిటీలోనూ అధికార పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ పీఠం కోసం అసమ్మత్తి స్వరాన్ని వినిపిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ప్రతిపాదిస్తున్నారు. దాంతో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేశారు. ఇకపోతే… గ్రేటర్ పరిధిలోని జవహర్‌నగర్ మేయర్ కావ్యకు, కార్పొరేటర్లకు పోసగకపోవడం అవిశ్వాసానికి దారితీసింది. మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకొని కార్పోరేటర్లను బుజ్జగించిన వారు వెనక్కి తగ్గలేదు. మేయర్‌పై 20 మంది కార్పొరేటర్లు శనివారం అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్‌కు అందజేసేందుకు వెళ్లగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఇన్‌వార్డులో ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ ఛైర్మన్ చెవుల స్వప్న చిరంజీవి, వైస్ ఛైర్మన్ చామ సంపూర్ణ శేఖర్ రెడ్డిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు
మున్సిపల్ యాక్ట్ ప్రకారం చైర్ పర్సన్ గా కొనసాగుతున్న వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే కనీసం మూడేళ్లు పూర్తి చేసుకోవాలి. పాలకవర్గాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతమున్న చైర్మన్లను తొలగించి తమకు పదవి అప్పగించాలన్న డిమాండ్‌తో పలు మునిసిపాలిటీల కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : గజ్వేల్ మున్సిపాలిటీలో గలాటా – రాజీనామా యోచనలో 14మంది కౌన్సిలర్లు