తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి , ఈటల రాజేందర్ ల మధ్య డబ్బుల వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం వరకు ఈ విషయం చేరడంతో వివేక్, ఈటలపై కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని పలుచన చేయకుండా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన నేతలు.. బహిరంగంగా వాదులాకోవడంపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది.
అదే సమయంలో ఈ అంశం ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా మారుతుందని భావించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు.. వివేక్ , ఈటల 10కోట్ల వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు అప్పగించినట్లు తెలుస్తోంది. వివేక్ కు ఈటల ఇవ్వాల్సిన రూ. 10కోట్లను చెల్లించాలని డీకే అరుణ హైకమాండ్ నేతల మాటగా చెప్పినట్లు తెలుస్తోంది. పైసల పంచాయితీ ఢిల్లీకి చేరిందని.. వెంటనే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఈటలకు చెప్పగా.. ఎన్నికల కోసం ఖర్చు చేసిన డబ్బులను ఎలా తిరిగి చెల్లిస్తారని ఈటల ప్రశ్నించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వివేక్ , డీకే అరుణల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ వివాదంలో వివేక్ కే డీకే అరుణ ఫేవర్ గా ఉంటుందని ఈటల భావిస్తున్నారని అంటున్నారు. అందుకే అంత డబ్బు సర్దుబాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని.. ఇంకొన్ని రోజులు ఆగాలని డీకే అరుణకు ఈటల చెప్పినట్లు సమాచారాం. ఈ అంశం బయటకు పొక్కడం.. ఢిల్లీ పెద్దల వరకు చేరడం పార్టీలో తన వ్యతిరేకుల పనేనని ఈటల అనుమానిస్తున్నారు. జాతీయ నేతల వద్ద తనను పలుచన చేసేందుకే.. 10కోట్ల వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఉంటారని సందేహిస్తున్నారు.
Also Read : నా 10కోట్లు ఇవ్వవా..? ఈటలను నిలదీసిన వివేక్
Also Read : 10 కోట్ల పంచాయితీ – ఈటలపై హైకమాండ్ సీరియస్