ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాజకీయ నేతగా చాలామంది అభిమానిస్తుంటారు. అలాంటి నేత నీచ కార్యానికి తన ఫామ్ హౌజ్ ను వేదిక చేశారు. కాసుల కక్కుర్తితో ఫామ్ హౌజ్ ను వ్యభిచార గృహంగా మార్చారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న ఈ వేశ్య గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి గుట్టురట్టు చేశారు.
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్. మారక్. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోని తన ఫాంహౌస్ లో వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై కొద్దిరోజుల కిందట పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫామ్ హౌజ్ పై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఆపై వ్యభిచార దందా జరుగుతుందని నిర్ధారించుకొని పోలీసులు ఇటీవల వేశ్యగృహంపై దాడి చేశారు.
30 వరకు చిన్న గదులున్న బెర్నార్డ్ ఎన్. మారక్ ఫాంహౌస్లో ఆరుగురు మైనర్లను బంధించగా.. వారికి పోలీసులు విముక్తి కల్పించారు. ఈ వ్యభిచార దందాతో సంబంధమున్న 73మందిని అరెస్ట్ చేసినట్లు వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్సీ విదేశా నంద్ సింగ్ తెలిపారు. తాము పక్కా ఆధారాలతో దాడి జరిపినట్లు చెప్పారు.
తాము రక్షించిన ఆరుగురు మైనర్లలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలిపారు. మైనర్ బాలురు, బాలికలను అపరిశుభ్రంగా ఉన్న చిన్నగ దుల్లో తాళం వేసి బంధించి ఉంచారన్నారు. ఈ దాడిలో 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500 కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపర్చామని… మైనర్ బాలికలను మాత్రం రెస్క్యూ హోం కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార దందాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read : కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసి.. చివరకు ఎంత పోగొట్టుకున్నాడంటే..!
తన ఫామ్ హౌజ్ పై దాడి, వ్యభిచారం సీఎం కోన్రాడ్ సంగ్మా ఆదేశాలతో జరిగినట్లు బెర్నార్డ్ మరక్ తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. ఇలాంటి వాటితో దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్పారు.