ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. కేటీఆర్ మాత్రం ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు క్యాడర్ సిద్దంగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు. కాకపోతే.. ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్రానికి ముడిపెట్టారు కేటీఆర్. కేంద్రం పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తుకు వెళ్తే.. తాము కూడా అసెంబ్లీని రద్దు చేస్తామని ప్రకటించారు.
ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతోన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి మొదటి వారంలోనే నిర్వహించడం బట్టి ముందస్తుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అదే విధంగా.. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో కేటీఆర్ స్పీడ్ పెంచారు. ఏప్రిల్ డెడ్ లైన్ పెట్టుకొని పని చేస్తున్నారు.ఈ అభివృద్ధిని ప్రజల ముందు ఉంచి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది.
మరోవైపు.. తెలంగాణ బిడ్డ ఢిల్లీని పాలించడానికి వెళ్తుంటే మీరే సహకరించకపోతే..దేశమంతటా తెలంగాణ పరువు పోతుందని సెంటిమెంట్ ను రాజేయనున్నారు. తెలంగాణలో మూడోసారి గెలిస్తే కేసీఆర్ వెంటనే జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకు వీలుంటుందని ప్రకటించే అవకాశం ఉంది. అయితే..ఈసారి బీఆర్ఎస్ కు విజయం అంత ఈజీ కాదు. తెలంగాణలో ట్రెండ్స్ మారుతున్నాయి. బీజేపీ , కాంగ్రెస్ మంచి జోరుమీదున్నాయి.
Also Read : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. ప్రగతి భవన్ కు కేసీఆర్ సెలవు..?
వచ్చే రెండు నెలలు ప్రజల్లో ఉండాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. చేరికలపై బీజేపీ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ మాత్రం నేతలను చేజారకుండా కాపాడుకునే పనిలో పడింది. దీనిని బట్టి బీఆర్ఎస్ అభద్రత భావనలో ఉందని అర్థం చేసుకోవచ్చు .