ఇటీవలి వరుస పరిణామాలు టీడీపీని కుంగదీస్తున్నాయి. పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు వరుస కార్యక్రమాలు చేపడుతున్న దశలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేపట్టగా ఆ యాత్ర మొదలైన కాసేపటికే నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేస్తుందని భారీ అంచనాల నడుమ మొదలైన పాదయత్ర ప్రారంభం రోజే ఈ అపశ్రుతి చోటుచేసుకోవడం పార్టీ వర్గాలకు మింగుడు పడటం లేదు.
ఇటీవలి చంద్రబాబు వరుస సభలో 11మంది మరణించగా.. తాజాగా లోకేష్ చేపట్టిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న అస్వస్థతకు గురి కావడం పార్టీ వర్గాలను బాధిస్తోంది. అదే సమయంలో పాదయాత్రపై కంటే మీడియా ఫోకస్ తారకరత్న హెల్త్ అప్డేట్ పైనే పడింది. జనాలు కూడా తారక్ రత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. అయితే..ఈ వరుస సంఘటనలు వైసీపీకి అస్త్రంగా మారాయి. తండ్రి కొడుకుల కార్యక్రమాల్లో అమాయకులు బలి అవుతున్నారని ప్రచారం స్టార్ట్ చేశారు. పలు సంఘటనలను ఉదాహరిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.
Also Read : చిరు, బాలయ్య సినిమాలతో కుల ఘర్షణలు – నారా లోకేష్ ఏం చెప్పారంటే..?
మంచి ముహూర్తం చూసి సర్వమత ప్రార్ధనలు చేసి.. లోకేష్ పాదయాత్ర చేస్తే తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. దీనిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. లోకేష్ అటు తారక్ హెల్త్ అప్డేట్ గురించి వాకబు చేయడం.. పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంపై దృష్టి సారిస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు చేస్తోన్న ప్రచారంపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు.
Also Read : వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కష్టమే..!
జనహితం కోసం జరుగుతోన్న ఈ సంగ్రామంలో ఇటువంటి కష్టాలు ఎదురవ్వడం సాధారణమేనని చెప్పుకొస్తున్నారు. ప్రజల కోసం ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటామని చెప్తున్నారు. ప్రజల నుంచి సానుభూతి కోరి కోడికత్తిలాంటి డ్రామాలు చేసిన వైసీపీ నేతలు.. ప్రమాదాలు, అనారోగ్యాలను రాజకీయాల కోసం వాడుకుంటారని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు.