భారతదేశంలో కులమున్నది నిజం. అది అందరి నరనరాల్లోకి వ్యాప్తి చెందింది. దాన్ని ప్రారద్రోలడం అంత సులువేం కాదు. దీన్ని సెలైన్ లా ఎక్కించారు. ఇందుకు సినిమాలు మినహాయింపేమీ కాదు.
కులం సినీ ఇండస్ట్రీలోనూ ఉంటుందని ఆర్ఆర్ఆర్ సినిమా “నాటు నాటు పాట” ఆస్కార్ అవార్డు రేసులో నిలిచిన సందర్భంగా మరోసారి నిరూపితమైనది. కులానికి టాలెంట్ తో పనిలేదు.పైకులమైతే ప్రతిభతో అసలే పనిలేదు. కింది స్థాయి కులాలకు చెందిన వారికీ ఎంత ప్రతిభ ఉన్న వ్యర్ధమేనని… ఈ పాట ఆస్కార్ రేసులో నిలిచిన సందర్భంగా దక్కుతోన్న అభినందనల బట్టి అర్థం అవుతుంది.
కులం ఎప్పుడు ఎదో ఒక రూపంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, తన ఉనికికి చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అవార్డుల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది. ఆ ఆశకి, ఆరాటానికి ఓ ఆదర్శనీయమైన విషయం ఉండాల్సిన పనిలేదు. ఆ అవార్డులకు , అర్హతకు కులమే ప్రధాన అర్హత. ఆ కులం అవార్డుల కోసం దేబిరిస్తుంటుంది. అవార్డులనివ్వమని పెద్దలను వేడుకుంటుంది. ఈ విషయం తెలియని అమాయక జనం.. పైస్థాయి కులహంకారులు తెరకెక్కించిన సినిమాల కోసం గంటల కొద్ది క్యూలో నిలబడి జేజేలు కొడుతున్నారు.
హాలీవుడ్ విజువల్స్ ను కాపీకొట్టి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించిన దర్శకధీరుడు.. హిందుత్వానికి మోస్ట్ ప్రియార్టి ఇచ్చే జక్కన తండ్రి విజయేంద్ర వర్మలు కుల అహంకారులు కూడా. హిందుత్వం కులాన్ని సజీవంగా ఉంచుమంటుంది. దానిని ఈ తండ్రి కొడుకులు విజయవంతంగా తమ సినిమాల ద్వారా మోస్తున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను నాజుకుగా పాడి ఆస్కార్ బరిలో నిలిపిన ఓ బీసీ బిడ్డ “రాహుల్ సిప్లిగంజ్ ” పేరు ఎక్కడ వినబడకపోవడం… కులవివక్ష, కులభారతానికి నిదర్శనం కాదా..!అగ్రవర్ణాలకు చెందిన వారంతా కలిసి రాహుల్ పేరును ఎక్కడ వినబడకుండా చేస్తున్నారు. ఓ సెలూన్ లో కటింగ్ చేస్తూ ఎదిగిన బీసీ బిడ్డకు ప్రపంచ వ్యాప్త గుర్తింపును ఆధిపత్య కులాలు ఎలా కోరుకుంటాయి చెప్పండి..?
కుల భారతంలో టాలెంట్ తో పనిలేదు. కులమే ప్రధాన అర్హత.