ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
తెలుగు , తమిళ చిత్రాలకు ఎన్నోసార్లు డబ్బింగ్ చెప్పారు శ్రీనివాస మూర్తి. తెలుగులో సూర్యా, మోహన్ లాల్, అజిత్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది హీరోలకు డబ్బింగ్ చెప్పారు. గొప్ప టాలెంట్ ఉన్న శ్రీనివాస మూర్తి చిన్న వయస్సులోనే చనిపోవడంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
శ్రీనివాస మూర్తి లాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ దొరకడం కష్టమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో చూసిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. కొన్నేళ్లుగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. విక్రమ్ అపరిచితుడు, సూర్య సింగం సిరీస్, 24, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు, అల వైకుంఠపురంలో జయరామ్ సుబ్రమణియన్, రాజశేఖర్ కు ఇలా ఎన్నో గొప్ప చిత్రాలు, ఎందరో స్టార్ హీరోలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పి, తన వాయిస్ తో అలరించారు.
క్యారెక్టర్ కు తగ్గట్లు వేరియేషన్, ఎమోషనల్ సీన్లలో తన గొంతుతో జనాలను ఎంతో మెప్పించారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను కంటతడి పెట్టేంచేవాడు. అది ఆయన గొంతు పవర్. శ్రీనివాసమూర్తి మృతిపై సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భౌతికంగా ఆయన లేకపోయినా.. ఆయన వాయిస్ తో ఎప్పటికీ గుర్తుండిపోతారనడంలో సందేహం లేదు.