అక్కినేని.. తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఇండస్ట్రీలో బాలయ్యకు మద్దతుగా కొందరు.. అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా మరికొందరు నిలిచారు. ఈ క్రమంలోనే హిందూపురంలో మీడియాతో మాట్లాడిన బాలయ్య తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
అక్కినేని నాగేశ్వరరావు ఆయన పిల్లల కంటే తనపై ఎక్కువ ప్రేమ చూపేవారన్నారు. తాను బాబాయ్ అని ప్రేమగా పిలుచుకునేవాడిని.. తన గుండెల్లో ఎప్పటికీ అపరిమితమైన అభిమానం ఉంటుందన్నారు. ఏదో ఫ్లో లో వచ్చిన మాటలను వక్రీకరించుకుని వ్యతిరేక ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు.
పొడగ్తలకు పొంగిపోకపోవడం..విమర్శలకు క్రుంగిపోకుండా పట్టుదలతో ఉండటం అక్కినేని నాగేశ్వర్ రావు నుంచే నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు బాలయ్య. ఎన్టీఆర్ ను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. అదంతా ఆయనపై చూపే అభిమానంగానే పరిగణిస్తామన్నారు.
సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పెడితే మొదట అక్కినేని నాగేశ్వరరావుకే అవార్డు ఇచ్చామని గుర్తు చేశారు. బాలయ్య ఫ్లోలో చేసిన వ్యాఖ్యలేనని చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసేపోయే అవకాశం కనిపిస్తోంది.
Also Read : వచ్చే ఎన్నికల్లో తారకరత్న పోటీ – లోకేష్ తో చర్చించారా..?