గౌతమ్ అదానీ… ప్రపంచ బిలియనీర్లలో ఒకరు. చాలా తక్కువ సమయంలో అంబానీని కూడా దాటేసి సంపన్నడిగా మారాడు. అంబానీ కిందిస్థాయి నుంచి ఎదిగాడు. అందుకే ఆయన బిలియనీర్ జాబితాలో చోటు సంపాదించుకోవడం ఆశ్చర్యంగా అనిపించలేదు. అదానీ మాత్రం అంబానీని మించి బిలియనీర్ జాబితాలోకెక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆయన అమంతం అలా ఎదగడానికి కారణం షేర్ మార్కెట్. అదానీ ఇటీవలి కాలంలో పోర్టుల్ని,ఎయిర్ పోర్టుల్ని కొనేస్తున్నారు. దీంతో సహజంగానే అదానీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరి సందేహం. అదానీకి ఆ డబ్బులు పోటీ పడి బ్యాంకులు, ఎల్ఐసీలు పంపిణీ చేస్తున్నాయి.
హిన్ డెన్ బెర్గ్ రీసెర్చ్ సంచలన విషయాలను బయటపెట్టింది. అదానీ వ్యాపార సామ్రాజ్యం ఓ పేక మేడ అని తేల్చింది. దీనిపై ఆదానీ గ్రూప్ స్పందించింది. అదంతా అవాస్తవమని పేర్కొంది. కాని నిజ, నిజాలెంటో చెప్పలేదు. ఇప్పుడు అదానీ షేర్లు స్టాక్ మార్కెట్లలో తగ్గుతున్నాయి. ఆయనపై నమ్మకం ఉంచి అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు నష్టపోతే ఆ ప్రభావం ఇండియా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే.. అదానీ గ్రూప్‌లో ఎల్ఐసి ఇప్పటికే రూ. లక్ష కోట్ల వరకూ పెట్టుబడిపెట్టింది. బ్యాంకులు అంతకు మించి అప్పులు ఇచ్చి ఉండొచ్చు.
గడిచిన ఎనిమిదేళ్ళ కాలంలో ట్రేడింగ్ కంపెనీగా నడిచే అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బాగా ఎదిగింది. ఎయిర్ పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులను కొనేస్తూ దిగ్గజ వ్యాపార సంస్థగా మారారు. వాటి షేర్లు పరుగులు పెడుతున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి పోటీ వ్యాపార కంపెనీలతో పోలిస్తే అత్యధిక విలువపై ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు విద్యుదుత్పాక సంస్థ అదానీ గ్రీన్ లాభంతో పోలిస్తే షేరు ధర 1,109 రెట్లు ఉంది. అదానీ గ్రూప్ షేరు విలువలను వాటి ఫండమెంటల్స్ రీత్యా అనూహ్యమైనవని, కొనదగ్గవి కాదని ఫండ్ మేనేజర్లు చెబుతూంటారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అదానీ గ్రూప్ అనేక వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడులు పెట్టడంపై ఒక రిపోర్ట్ అందించింది.
ఇది కంపెనీపై రుణాల భారాన్ని పెంచుతోందని అభిప్రాయపడింది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అదానీ గ్రూప్ అప్పుల ఊబిలో కూరుకుపోయి డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని క్రెడిట్‌సైట్స్ అప్పట్లో తన నివేదికలో పేర్కొంది. అదే జరిగితే ముందుగా నష్టపోయేది.. ఎల్ఐసీనే.. బ్యాంకులే. ఆ ప్రభావం ఇండియన్ ఎకానమీపై ప్రభావం చూపుతాయి. అందుకు కారణం.. ఆయనకు సహాకరించిన వారే అవుతారు.