పోలీసు ఉద్యోగాలు (ఎస్సై, కానిస్టేబుల్) నియామక ప్రక్రియలో పాత పద్ధతిని కొనసాగించాలని యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడుతు.. పొలిసు రిక్రూట్ మెంట్ బోర్డుపై ఒత్తిడి పెంచుతున్నా పట్టించుకోకపోవడంతో గవర్నర్ తమిళిసైని కలిసి పోలీసు అభ్యర్థుల ఆందోళనను ఆమెకు వివరించారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ అయిన యూత్ కాంగ్రెస్ నేతలు పొలిసు ఉద్యోగార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చొరవ చూపాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ తీసుకున్న నిర్ణయాల వలన చాలామందికి అన్యాయం జరిగింది. లాంగ్ జంప్, షాట్ పుట్ గతం కంటే ఎక్కువ పెంచడం వలన ఎంతోమంది ఉద్యోగార్థులు డిస్ క్వాలిఫై అయ్యారు. ఫలితంగా 2.8 లక్షల మంది ఉద్యోగానికి ఎంపిక కాకుండా పోయారని శివసేనా రెడ్డి చెప్పారు. ఏళ్లకాలంగా ఉద్యోగం కోసమని ప్రిపేర్ అవుతున్న పొలిసు ఉద్యోగార్థులు పొలిసు రిక్రూట్ మెంట్ బోర్డు తాజా నిర్ణయం వలన అనర్హులుగా మారిపోయారని మండిపడ్డారు.
దేహదారుడ్య పరీక్షలో అర్హత సాధించిన వారిని మెయిన్స్ పరీక్షకు అనుమతించాలని శివసేనా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేకపోతె సర్కార్ పై తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ది కేసీఆర్ కు లేదని అందుకే కొత్త నిబంధనలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
నిరుద్యోగుల ఆవేదనను సర్కార్ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న శివసేనారెడ్డి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుడ్య పరీక్షలో క్వాలిఫ్ అయిన వారిని మెయిన్స్ కు అనుమతించాలని కోరుతూ గవర్నర్ ను కలవనున్నట్లు చెప్పారు.