యువగళం పేరిట నారా లోకేష్ ప్రారంభించనున్న పాదయాత్రకు పోలీసులు అనుమతిచ్చారు. కాకపోతే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. మొత్తంగా 14కండిషన్స్ పెట్టారు. వీటిని తప్పనిసరిగా పాటించాలంటూ ఆదేశించారు. అయితే.. ఆ కండిషన్స్ ఎప్పుడు పాటించేవే.
ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని కండీషన్స్ పెట్టారు. వీటిని తప్పనిసరిగా పాటించాలని చిత్తూర్ జిల్లా ఎస్పీ ఆదేశించారు. నిజానికి ఎవ్వరు పాదయాత్రలు చేసినా, యాత్రలు చేసినా అత్యవసర సేవలకు ఆటంకం కల్గించాలని చూడరు. ఒకవేళ చూసిన ఆ ఎఫెక్ట్ పాదయాత్ర చేసేవారిపైనే పడుతుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో అత్యవసర సేవలకు ఆటంకం కల్గించరు. అయినా ఈ షరతులను ప్రత్యేకంగా ఇవ్వడం పట్ల టీడీపీ నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
27న కుప్పంలో ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్ర నాలుగు వందల రోజులపాటు 4వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర పడటంతో నాయకులు క్యాడర్ ఏర్పాట్లలో తలామునకలైయ్యారు. పాదయాత్రకు జనం నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటే అల్లర్లను సృష్టించి..షరతులను ఉల్లఘించారని పాదయాత్రను అడ్డుకునే అవకాశం లేదని టీడీపీ నేతలు సందేహిస్తున్నారు.
పోలీసులు ఎలాంటి ఆటంకాలు కల్పించినా వాటి రాజకీయంగా ఎదుర్కోవాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇందు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించుకున్నారు.