దేశంలోనే అత్యంత అందమైన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అనే పేరుంది. ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనకుండా సివిల్ ఎందుకు రాసిందని మన రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఓ మీటింగ్లో కంప్లీమెంట్ ఇచ్చాడు. ఆమె ఏ మీటింగ్ కి వెళ్లినా అందరి చూపు ఆమె మీదే ఉంటుదని ఒప్పుకోక తప్పదు. ఆమె క్రమశిక్షణకు మారు పేరని కేసీర్ మెచ్చుకున్నారు. ఇప్పుడున్న అతికొద్దిమంది నిజాయితీ గల ఐఏఎస్ లో ఆమె ఒకరు అని కేటీఆర్ చాలాసార్లు మెచ్చుకున్నారు. ఆమెను చూస్తుంటే మనకు ఇలాంటి ఓ చెల్లెలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నిజాయితీకి ఆమె నిలువెత్తు కటౌట్.
అలాంటి స్త్రీమూర్తి ఇంటిలోకి, అడుగడునా జెడ్ సెక్యూటిరీటీలా ఉండే ఐఏఎస్ హెడ్ క్వార్టర్ గ్రేటర్ కమ్యూనిటీ లో పట్టపగలే ఓ అగంతకుడు జొరబడ్డాడు. అతను క్రిమినల్ ఐతే అసలిది వార్తనే కాదు. కానీ అతను మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి. ఇది కూడా వార్త కానేకాదు. ఇక్కడ అసలైన వార్త ఏమిటంటే – కేసీఆర్ పరిపాలనా దక్షత మీద పట్టు కోల్పోవడం. ఆయన కనుసన్నల్లో పనిచేసే తహసీల్దార్ వ్యవస్థ ఆయన ఆదేశాలను బేఖాతర్ చేయడం.
స్వయానా ఓ డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ఓ ఐఏఎస్ ఇంటిలోకి జొరబడటం ఎంతటి నేరమో అతనికి తెలియదా? పైగా వయసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి జొరబడటం బరితెగించిన నేరాలకు పరాకాష్ఠ కదా? ఆనంద్ కుమార్ రెడ్ట్ డబ్బు కోసం జొరబడదలిస్తే ఏ బ్యాంకులోనో జొరబడాలి. ఆమెను చంపవలసిన అవసరం అతనికి లేదు. వాళ్ళ మధ్య పగలు – ప్రతీకారాలు లేవు. మరి ఎందుకు జొరబడ్డాడో మీరే అర్థం చేసుకోవాలి.
ఇక ఐఏఎస్ మహిళకు రక్షణ లేనప్పుడు సాధారణ గృహిణి పరిస్థితి ఏమిటి? ఇది కేసీఆర్ అసమర్థ పరిపాలనకు మచ్చు తునక అని మహిళలు భయపడుతున్నారు. మహిళా రక్షణ కోసం ‘షీ టీమ్’ ఏర్పాటు చేశాము, అడుగడుగునా మహిళా రక్షణ కోసం పోలీసులు వేల సంఖ్యలో నియమించాము, మహిళా రక్షా – తెలంగాణ రక్ష లాంటి ప్రగల్బాలు పలికితే ఎవరు నమ్ముతారు? ఎలా నమ్మాలి. అవి కార్యాచరణలో లేనప్పుడు ఎందుకీ కేసీఆర్ పరిపాలన అనీ మహిళాలోకం నిలదీస్తోంది.
మహిళల మానానికే కాదు – పురుషులకు ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది అనడానికి మరో ఉదాహరణ – నిన్న జరిగిన జియాగూడ నరమేధం. ముగ్గురు నరరూప రాక్షసులు సాయి కుమార్ అనే యువకుడిని మధ్యాహ్నం నాలుగు గంటలకు నడి రోడ్డు మీద ఊచకోత కోశారు. ఒకటికాదు, రెండు కాదు, దాదాపు ముప్ఫయి పోట్లతో రక్త సిక్తం చేశారు ఇలాంటి హత్యలు రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ ల మధ్య కూడా కూడా జరగవు.
నిజానికి ఇది కూడా వార్త కానేకాదు. ఇలాంటి సీన్లు ఫ్యాక్షన్ సినిమాల్లో జనం చూశాము. వార్త ఏమిటంటే – తెలంగాణాలో ప్రతి రోడ్డు మీదా కోట్లాది రూపాయలు ఖర్చుచేసి లక్షలాది సిసి కెమెరాలు ఏర్పాటు చేశామనీ, ఏ చిన్న నేరం జరిగినా కంట్రోల్ రూంలో పోలీసులు వందలాది కెమెరాల్లో డేగా కళ్లతో లైవ్ లో కాపు కాస్తున్నారని సీఎం చెప్పని రోజులేదు. దేశంలోనే నెంబర్ వన్ సిసి కెమెరా సిస్టం మనదే అని గొప్పలు చెపుతారు.
మరి అదే నిజమైతే ముగ్గురు హంతకులు మారణాయుధాలు పట్టుకుని సాయి కుమార్ని జియాగూడ నడి రోడ్డు మీద సినిమా ఫక్కీకో వెంటాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సకాలంలో ఆ నేరాన్ని ఎందుకు ఆపలేదు అని జనం నిలదీస్తున్నారు. నగరంలోనే కార్పొరేట్ ఆఫీస్ లెవల్లో క్రైమ్ కంట్రోల్ హబ్, టీ హబ్ లు కొత్తగా కోట్లు పెట్టి కట్టించారు. మరి ఇవన్నీ షో ఫుట్ అప్ లుగా ఎలా మారాయి? చేతులు కాలాకా ఆకులు పట్టుకునే కెసిఆర్ ప్రభుత్వం ఎందుకని జనం నిలదీస్తున్నారు