పెళ్లిల విషయంలో వింత పోకడలు పోతుంది నేటి యువత. పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. తండ్రి వయస్సున్న వ్యక్తిని ప్రేమించడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఓ విచిత్ర సంఘటన సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి అతడి తండ్రినే పెళ్లి చేసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవడం కామన్. కాని ఆ మహిళ భర్త తండ్రినే పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది.
అమెరికాలోని కెంటూకి చెందిన ఎరికా అనే మహిళ జస్టిన్ అనే వ్యక్తిని కొన్నాళ్ళ క్రితం పెళ్లి చేసుకుంది. వారికీ ఓ బాబు కూడా ఉన్నాడు. చాలాకాలం సాఫీగా సాగిన వారి కాపురంలో మెల్లగా కలహాలు స్టార్ట్ అయ్యాయి. చివరికి ఇలా నిత్యం గొడవలు పడుతూ లైఫ్ ను లీడ్ చేయడం సాధ్యం కాదని విడాకులు తీసుకోవాలనుకున్నారు. విడిపోయి మంచి మిత్రులా ఉండాలని భావించారు.
దీంతో ఎరికా.. జస్టిన్ ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేసుకున్నారు. కొన్నాళ్ళ తరువాత విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తరువాత ఎరికా.. జెఫ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే తన ప్రియుడిని మాజీ భర్తకు చూపించాలనుకుంది ఎరికా. ఇందుకోసం మాజీ భర్తతో తన ప్రియుడికి మీటింగ్ ఏర్పాటు చేసింది.
అప్పుడు జెఫ్, జస్టిన్ ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అయ్యారు. అయితే.. జెఫ్ ఎవరో కాదు. జస్టిన్ కు సవతి తండ్రి. దీంతో తన ప్రియురాలు ఎవరో కాదు తన కోడలే అని జెఫ్ కి అర్ధమైంది. అయినా ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి అలానే ఉంటున్నారు. ఎరికా.. జెఫ్ కంటే 29 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ మనస్సులు కలవడంతో ప్రేమించుకున్నారు.
ఎరికా ఒకప్పటి తన మామను ఇటీవల పెళ్లి చేసుకుని మెుగుడిని చేసుకుంది. అలానే ఒకప్పుడు తన భార్య.. నేడు పిన్ని కావడాన్ని జస్టిన్ జీర్ణించుకోలేకపోయాడు. అయితే…ముగ్గురు కలసి, పిల్లలతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇలాంటివి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలో జరుగుతునే ఉంటాయి.