సోషల్ మీడియాలో వచ్చే వాటిని చదువుతూ మనకు తెలియకుండానే మన పెదవిపై చిరునవ్వు వెలుగుతుంది. ఒక్కోసారి వాటిని చూసి నవ్వాపుకోలేక పక్కున నవ్వేస్తుంటాం.
ఒక్కొక్కసారి మనకి నిజ జీవితంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో భార్యాభర్తల జోక్స్ మనకి కనబడుతూ ఉంటాయి. వీటిని చూస్తే మనం అసలు నవ్వపుకోలెం. అయితే ఒక భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి వాట్సప్ లో మెసేజ్ పెడుతుంది. ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ సందేశం ఏంటో చదివి మీరు కూడా నవ్వేయండి..
1.పార్టీలు లాంటివి ఇంట్లో పెట్టొద్దు. ఇల్లు శుభ్రం చేయడానికి నాకు రెండు రోజులు పడుతోంది.
2. పక్కింటి వాళ్ళని పాలు వచ్చాయా పేపర్ వచ్చిందా అని పొద్దున్నే లేపకండి.. వాళ్లని ఆస్తమాను ఇలా పిలిచి చిరాకు పెట్టొద్దు. మిమ్మల్ని తిట్టడం సరి కదా ఊరెళ్ళి నిద్ర చెడగొట్టినందుకు నన్ను కూడా తిట్టుకుంటారు.
3.నేను లేనన్ని రోజులు మన పనిమనిషి పనిలోకి రాదు. వాళ్ళ అమ్మ మాత్రమే పనిలోకి వస్తుంది.
4. అద్దం ముందు గంటలు గంటలు నిలబడి తయారవ్వకండి. మీరు తొందరగా పని చేసుకోవాలనే టైం కొంచెం ఫాస్ట్ గా పెట్టాను. ఆ టైం ని మీరు ఫాలో అవ్వండి.
5. తిరిగి మళ్ళీ నేను వచ్చేస్తానన్న విషయాన్ని మర్చిపోవద్దు.
6. ఎన్నిసార్లు వెలిగించినా స్టవ్ వెలగడం లేదని టెన్షన్ పడి నాకు లాస్ట్ టైం లాగ ఫోన్ చేయొద్దు. స్టవ్ వెలిగించే ముందు ఆన్ చేయడం మర్చిపోకండి.
7. కళ్ళజోడు ని బాత్రూం లో పెట్టి మర్చిపోవద్దు.
8. ఇంటర్నెట్ రావట్లేదని కంప్లైంట్ ఇవ్వద్దు. ఫోన్ పట్టుకుంటే అర్ధరాత్రి అయినా తెలియడం లేదని ఇంటర్నెట్ ని కట్ చేయించాను.